దాదాపు పది సంవత్సరాల పోరాటం తర్వాత జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. జగన్ రాజకీయ రంగంలో అడుగు పెట్టిన నాటి నుండి ఇప్పటి వరకు అన్నీ ఎదురు దెబ్బలే. మొట్టమొదటిసారి ఎంపీ అయ్యాక తండ్రి చనిపోవటం. తర్వాత తాను కాంగ్రెస్ నుండి బయటకు వచ్చేలా పరిస్థితులు మారడం, పార్టీ స్థాపించడం తర్వాత జైలుకు వెళ్లడం, తర్వాత రాష్ట్రం విడిపోయి జరిగిన ఎన్నికలలో ప్రతిపక్ష నేతగా ఎన్నికవడం మనకందరికీ తెలిసినదే. అయితే ఏపీ ప్రతిపక్ష నేత గా అనేక పోరాటాలు చేసి గత సార్వత్రిక ఎన్నికలలో అనేక హామీలు ఇచ్చి ముఖ్యమంత్రిగా జగన్ ఎన్నిక అయితే ఇప్పుడు 11 నెలలు కావస్తోంది.
కరోనా వైరస్ తో ఆంధ్రప్రదేశ్ ఖజానా చాలా వరకు ఖాళీ అయిపోయింది అని వార్తలు వస్తున్న సమయంలోనే… వస్తున్న నిధులను ఇటీవల ఫీజు రియంబర్స్మెంట్ కింద పిల్లల తల్లుల ఎకౌంట్లో జమ చేయడం జరిగింది. తాజాగా మహిళలకు ఇలాంటి విపత్కర సమయంలో కూడా సున్నా వడ్డీ పథకం అమలు చేయడం చూస్తుంటే వచ్చిన సీఎం అవకాశం ఎంత ముఖ్యమో జగన్ బాగా అలవర్చుకున్నటు అర్థమవుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతిపక్షానికి ప్రశ్నించే ఛాన్స్ ఇవ్వకుండా జగన్ వ్యవహరిస్తున్నట్లు ప్రజంట్ జరుగుతున్న పరిణామాలు బట్టి తెలుస్తోంది.