అంగన్వాడీలకు ఏపీ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త..

-

అంగన్వాడీలకు ఏపీ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త.. చెప్పింది. అంగన్వాడి సూపర్వైజర్ల పోస్టుల భర్తీకి కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి. అంగన్వాడి సూపర్వైజర్ల పోస్టుల భర్తీ అత్యంత పారదర్శకంగా జరుగుతోందన్నారు. సెప్టెంబర్ 30వ తేదీ కల్లా అంగన్వాడి సూపర్వైజర్ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

cm jagan

మహిళా, శిశు సంక్షేమ శాఖపై సీఎం సోమవారం ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ సూపర్వైజర్ల పోస్టుల భర్తీకి పరీక్షలు అత్యంత పారదర్శకంగా నిర్వహించామని, ఇంటర్వ్యూలు ముగిశాక మార్పుల జాబితాను వెల్లడిస్తామని వెల్లడించారు. పరీక్షలకు హాజరైన అభ్యర్థులు అవసరమనుకుంటే తమ ఆన్సర్ షీట్లను కూడా పరిశీలించుకునే అవకాశం కల్పిస్తామని చెప్పారు. పరీక్షల ప్రక్రియను పూర్తిచేసి సెప్టెంబర్ 30 కల్లా సూపర్వైజర్ లను నియమించేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version