ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. 3,432 పోస్టుల భర్తీకి నోటీఫికేషన్లు

-

ఏపీ నిరుద్యోగులకు శుభవార్త. హైకోర్టుతో పాటు ఇటు జిల్లా కోర్టుల్లో సుదీర్ఘకాలంగా ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి హైకోర్టు చర్యలు చేపట్టింది. ప్రధానంగా హైకోర్టులో పెద్ద సంఖ్యలో పోస్టుల ఖాళీలతో ప్రస్తుతం ఉన్న ఉద్యోగులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.

ఇది హైకోర్టు పాలనపై తీవ్ర ప్రభావం చూపుతుండడంతో ఖాళీల భర్తీపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఇటీవల ఉద్యోగులందరికీ పదోన్నతులు కల్పించి తద్వారా ఏర్పడిన ఖాళీలను సైతం ఇప్పటికే ఉన్న ఖాళీలతో కలిపి భర్తీ చేయాలని నిర్ణయించారు.

అందుకనుగుణంగా హైకోర్టులో వివిధ కేటగిరీల్లో 241 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసింది. అలాగే, జిల్లా కోర్టులు కూడా ఉద్యోగుల కొరతను ఎదుర్కొంటున్నాయి. ఆ వివరాలన్నింటిని ఆయా కోర్టుల నుంచి తెప్పించుకున్న ప్రధాన న్యాయమూర్తి అక్కడ ఖాళీల భర్తీకి ఆదేశాలు ఇచ్చారు. వీటి ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లా కోర్టులో వివిధ కేటగిరిలో 3,432 పోస్టుల భర్తీకి హైకోర్టు వర్గాలు నోటిఫికేషన్లు జారీ చేశాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version