కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్…!

-

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి పండుగ సీజన్‌ సందర్భంగా డబుల్ బోనస్ వచ్చే అవకాశం వుంది. అయితే 7వ వేతన సంఘం మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న ఉద్యోగులకు త్వరలోనే గుడ్ న్యూస్ అందుతుంది అని తెలుస్తోంది. అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే డీఏ, డీఆర్ పెరగడం తో పాటుగా డబుల్ బోనస్ కూడా వచ్చేలా కనపడుతోంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ప్రభుత్వం ఉద్యోగుల డీఏను 17శాతం నుంచి 28 శాతానికి పెంచింది. అది జూలై 1 నుంచి అమల్లోకి వచ్చింది.

money

ఆ తర్వాత HRAని కూడా పెంచింది. ఉద్యోగుల బేసిక్ శాలరీ ఆధారంగా ఈ డీఏలు అవి ఉంటాయి. ఇది ఇలా ఉంటే ప్రభుత్వ ఉద్యోగులు ఉండే నగరాల ఆధారంగా HRAను ప్రభుత్వం అందిస్తుంది. అయితే మొత్తం ఇది మూడు క్యాటగిరీలుగా విభజించింది. X క్యాటగిరీలోని ఉద్యోగులకు HRA 27 శాతానికి పెరగనున్నట్లు తెలుస్తోంది. అలానే Y క్యాటగిరీ.. అంటే 5 లక్షల కన్నా ఎక్కువ జనాభా ఉన్న నగరంలోని ఉద్యోగులకు 18%, Z క్యాటగిరీ.. అంటే 5 లక్షల కన్నా తక్కువ జనాభా ఉండే నగరాల్లోని ఉద్యోగులకు 9% HRA అందించనున్నట్లు తెలుస్తోంది. లెవల్-1లో రూ .18 వేల నుంచి రూ.56,900 వరకు నెలవారీ వేతనం ఉంటుంది.

అంటే ప్రభుత్వ ఉద్యోగి వేతనం కనీసం రూ.18వేలు ఉంటుంది. 17 శాతం DA రేటు ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు 2021 జూన్ వరకు డియర్‌నెస్ అలవెన్స్‌గా రూ. 3,060 పొందుతున్నారు. అయితే జూలై 2021 నుంచి ఉద్యోగులు నెలకు రూ. 5,040 పొందుతున్నారు. దీని ఆధారంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నెలవారీ జీతం రూ. 1,980 పెరిగింది. అయితే కరోనా వలన గత ఏడాది నుంచి ఈ ఏడాది ప్రథమార్ధం వరకు ఉద్యోగులు, పెన్షనర్లకు DA పెంపును నిలుపుదల చేసింది. అయితే ఈ మేరకు ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, జ‌మ్మూ కాశ్మీర్‌, అసోం, జార్ఖండ్‌, హ‌ర్యానా, రాజ‌స్థాన్ రాష్ట్రాల ఉద్యోగుల వేత‌నాలు భారీగా పెరిగాయి. కాగా క‌ర్ణాట‌క రాష్ట్రం మాత్రం 21.5 శాతం DA మాత్ర‌మే పెంచింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version