రైతులకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ గుడ్ న్యూస్ ప్రకటించారు. కూటమి అధికారంలోకి వస్తే వ్యవసాయానికి ప్రతి రోజూ 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ అందిస్తామని ఆయన తెలిపారు. కోనసీమ జిల్లా మండపేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ కేంద్ర నిధులన్నీ పంచాయతీలకే ఇస్తామని చెప్పారు. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని నెరవేరుస్తామన్నారు. ప్రజలు కూటమిని ఆదరించాలని.. అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు.
ముఖ్యంగా యువతకు ఉద్యోగాల కల్పన బాధ్యత కూటమి తీసుకుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తొలి సంతకం డీఎస్సీపైనేనని హామీ ఇచ్చారు. కౌలు రైతులకు గుర్తించి కార్డులిచ్చి.. వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. సబ్సీడీతో వ్యవసాయ పరికరాలు అందజేస్తామన్నారు. గ్రామీణ ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.