జూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..!!

-

కొరటాల శివ దర్శకత్వంలో జూ ఎన్టీఆర్  NTR 30  సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం శివ తన ప్రాణం పెట్టి మరీ పనిచేస్తున్నాడట. ఈ ప్రాజెక్ట్ గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎన్టీఆర్ అభిమానులకు కొరటాల శివ ఎన్టీఆర్ గుడ్ న్యూస్ చెప్పబోతున్నారని ఓ ఆసక్తికరమైన సమాచారం బయటకు వచ్చింది.

కొరటాల RRR తర్వాత  జూ ఎన్టీఆర్ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని స్క్రిప్ట్ లో అనేక మార్పులు చేసారు. టోటల్ స్క్రిప్ట్ వర్క్ మొత్తం ఒక కొలిక్కి వచ్చిందట. ఇక  ఎన్టీఆర్ టైమ్ తీసుకొని పూర్తి స్క్రిప్ట్ వినిపించాలని కొరటాల రెడీగా ఉన్నారట. ఎన్టీఆర్ స్క్రిప్ట్ నచ్చి ఓకే అంటే వెంటనే ముహూర్తం పెట్టుకొని మిగిలిన ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టాలని చూస్తున్నారట.

షూటింగ్ కూడా చాలా తొందరగా మొదలు పెట్టాలనే ఆలోచనతో ఉన్నారట. ఇప్పటికే చాలా రోజులు వృధా అయ్యాయి అని షూటింగ్ షెడ్యూల్స్ ప్లాన్ కూడా ముందే రెడీగా పెట్టుకున్నారని తెలుస్తోంది. జూ ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయితే వెంటనే ఓపెనింగ్ ఫంక్షన్, ఆ వెంటనే డిసెంబర్ లో  షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది.ఈ మూవీని యువ సుధా ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కల్యాణ్ రామ్ సమర్పణలో సుధాకర్ మిక్కిలినేని నిర్మించబోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version