జగన్.. ఆనాడు అబద్దాలను నిజంగా నమ్మించాడు : అయ్యన పాత్రుడు

-

అమరావతిలో బుద్దా వెంకన్న చేస్తున్న నిరవధిక దీక్షకు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన పాత్రుడు, కేశినేని చిన్ని మద్దతు పలికారు. ఈ సందర్భంగా అయ్యన పాత్రుడు మాట్లాడుతూ.. జగన్.. ఆనాడు అబద్దాలను నిజంగా నమ్మించాడని విమర్శించారు. రాష్ట్రం మొత్తం పూర్తిగా సర్వ నాశనమైందని, పనికిమాలిన వాడు సీఎం అయితే ఎలా ఉంటుందో ఏపీ ఉదాహరణ అని అయ్యన పాత్రుడు అన్నారు. 48 మంది సలహాదారులు కావాలంట ఈ పోటుగాడికి.. ఒక్కోక్క సలహాదారుకు మళ్లీ ఐదు లక్షల రూపాయలు జీతాలంట అంటూ అయ్యన పాత్రుడు ఎద్దేవా చేశారు. జైలుకెళ్లిన దొంగ చెప్పింది పోలీసు గుడ్డిగా చేస్తున్నారు. ఇసుక, మైనింగ్ మాఫియాకు పోలీసులే కాపలా. మైనింగ్ తవ్వకాలు సీఎం భార్యకు చెందిన భారతి సిమెంటుకు వెళుతుంది. ఇంత పబ్లిక్కుగా జరిగితే పోలీసు అధికారులు ఏం చేస్తున్నారు. మేం దీనిపై మాట్లాడితే కేసు పెట్టి, ఇళ్లపై దాడులు చేస్తారా..?

నాపై ఏకంగా రేప్ కేస్ పెట్టారు.. ఈ వయస్సులో నేనేం చేస్తాను. బొత్సను బహిరంగ చర్చకు రమ్మంటే వచ్చే దమ్ము లేదు. మా ఇళ్లల్లో ఆడవాళ్లను తిట్టిస్తారు.. వాళ్లకి సంబంధం ఏంటి..? గంజాయి, మద్యం వ్యాపారాన్ని, కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. టీ తాగితే ఫోన్ పే చేస్తాం.. మద్యం షాపులో మాత్రం డబ్బే ఇవ్వాలంట. మార్కెట్లో రెండు వేల నోటు లేకుండా పంపిణీ కోసం
దాచేశారు. విజయసాయి రెడ్డి పెద్ద దొంగ.. విశాఖపట్నంలో రూ. 45 వేల కోట్లు దోపిడీ చేశాడు. జగన్ గుట్టంతా విజయసాయి రెడ్డి దగ్గర ఉందనే భయం. నిర్మాత సురేష్ బాబు‌ను బెదిరించి స్థలం రాయించుకున్నారు. శాడిస్ట్ నా కొడుకులు పాలన చేస్తే రాష్ట్రం ఇలాగే ఉంటుంది అంటూ అయ్యన పాత్రుడు మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version