లక్షలాది మంది రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్..?

-

లక్షలాది మంది ఇండియన్ రైల్వే ఉద్యోగులకి గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. రైల్వే ఉద్యోగులకు నైట్ డ్యూటీ అలవెన్స్‌ను త్వరలోనే ఇస్తున్నట్టు ప్రభుత్వం చెప్పింది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. నైట్ డ్యూటీ అలవెన్స్ నిబంధనలను మార్చక బేసిక్ వేతనం రూ.43,600కి పైగా ఉన్న వారికి నైట్ డ్యూటీ అలవెన్స్‌ను పే చెయ్యలేదు. కానీ ఇప్పుడు ఈ అలవెన్స్‌ను వీరికి కూడా ఇస్తామని అంది.

Indian-Railways

రైల్వే మంత్రిత్వ శాఖ, ఆర్థిక మంత్రిత్వశాఖకు దీనిని పరిష్కరించాలని అభ్యర్థన పెట్టుకుంది. ప్రస్తుతం ఈ ఇష్యూ ఆర్థిక మంత్రిత్వ శాఖ టేబుల్‌పై ఉంది. అయితే ఇది త్వరలోనే పరిష్కారం అవ్వనున్నట్టు తెలుస్తోంది. బేసిక్ వేతనం రూ.43,600కి పైన ఉన్న ఉద్యోగులకు నైట్ డ్యూటీ అలవెన్స్ ఆపివేయడంతో మూడు లక్షల మందిపై ఎఫెక్ట్ పడింది. అయితే రాత్రి పూట రైళ్లు నడిపే డ్రైవర్లకు, ఆపరేటర్లకు, నిర్వహణ కూలీలకు నైట్ డ్యూటీ అలవెన్స్‌ను అందిస్తారు.

ఈ ఆర్డర్ తర్వాత రైల్వే ఉద్యోగులపై ప్రభావం పడనుంది. అందుకే మళ్ళీ అలవెన్స్ ని ఇచ్చేలా కనపడుతోంది. రైల్వే బోర్డు ఆమోదం కోసం పంపింది. బోర్డు ఆమోదం కోసం, ఎక్స్‌పెండించర్ విభాగం, ఆర్థిక మంత్రిత్వ శాఖలు ఈ ప్రతిపాదనను స్వీకరించినట్టు రైల్వే బోర్డు సెక్రటరీ అన్నారు.

ఆఫీసు మెమోరాండం ద్వారా ఈ ప్రతిపాదనను పంపడం జరిగింది. రైల్వే సిబ్బంది మంత్రిత్వ శాఖపై, వాటి సంబంధిత సంస్థలపై ఒత్తిడి పెడుతున్నారని… రైల్వే బోర్డు ఆర్థిక మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరుపుతుందని.. త్వరలోనే ఆదేశాలను జారీ చేస్తారని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version