పులివెందులలో బీటెక్ రవి దూకుడు?

-

పులివెందుల అంటే వైఎస్సార్ ఫ్యామిలీ కంచుకోట అనే సంగతి అందరికీ తెలిసిందే…ఇక్కడ  ఆ ఫ్యామిలీకే తప్ప మరొకరికి గెలిచే అవకాశాలు లేవు…అసలు గెలవలేరు కూడా. ఇప్పుడు పులివెందుల నుంచి సీఎం జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. అసలు పులివెందులలో జగన్‌ని ఓడించడం జరిగే పని కాదు..కాకపోతే పులివెందులలో గెలవకపోయిన, జగన్ మెజారిటీ తగ్గిస్తే గ్రేట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు టీడీపీ నేత బీటెక్ రవి అదే పనిలో ఉన్నారని చెప్పొచ్చు.

గత కొన్ని ఎన్నికల నుంచి వైఎస్ ఫ్యామిలీ ప్రత్యర్ధిగా సతీశ్ రెడ్డి పోటీ చేసి ఓడిపోతూ వచ్చిన విషయం తెలిసిందే. అయితే గత ఎన్నికల్లో కూడా సతీశ్ రెడ్డి, జగన్‌పై పోటీ చేసి దాదాపు 90 వేల ఓట్ల భారీ మెజారిటీతో ఓడిపోయారు. ఇక ఈ ఓటమి తర్వాత సతీశ్ రెడ్డి ఏకంగా రాజకీయాలకే దూరం అయ్యారు. వైసీపీ అధికారంలోకి రావడంతో…రాజకీయంగా ఇబ్బందులు వస్తాయని భావించి సతీశ్ రెడ్డి సైడ్ అయిపోయారు.

 దీంతో పులివెందుల టీడీపీ ఇంచార్జ్‌గా బీటెక్ రవిని నియమించారు…ఇక ఇంచార్జ్‌గా వచ్చిన దగ్గర నుంచి రవి దూకుడుగానే ముందుకెళుతున్నారు. రాజకీయంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైన సరే రవి వెనక్కి తగ్గడం లేదు. పులివెందులలో టీడీపీ బలం పెంచడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. అలాగే పులివెందులలో ఉన్న సమస్యలపై గళం విప్పుతున్నారు. తాజాగా కూడా వేంపల్లి పాపాఘ్న నది నుంచి అక్రమ ఇసుక రవాణా జరుగుతోందని, ఇసుక ద్వారా ఖజానాకు రావాల్సిన డబ్బంతా వైఎస్‌ కుటుంబానికే పోతోందని ఆరోపిచ్చారు. అలాగే టీడీపీ బృందం అక్రమ ఇసుక రీచులను పరిశీలిస్తామని, అదేవిధంగా డ్రిప్ మెటీరియల్ అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, డ్రిప్ సమస్యపై త్వరలో పులివెందులలో 40 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహిస్తామని బీటెక్ రవి చెప్పారు. ఈ విధంగా పులివెందులలో ఉండే సమస్యలపై బీటెక్ రవి స్పందిస్తూనే ఉన్నారు. అయితే ఈ సారి పులివెందులలో జగన్ మెజారిటీ తగ్గించగలిగితే బీటెక్ రవి సక్సెస్ అయినట్లే అని చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version