ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు శుభవార్త

-

ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు జగన్‌ సర్కార్‌ తీపకబురు చెప్పింది. శాఖాపరమైన పరీక్షల్లో ఉత్తీర్ణులు కాని వారి కోసం మళ్లీ పరీక్షలు నిర్వహించేలా ఏపీపీఎస్‌సీకి సిఫార్సు చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక కార్యదర్శి అజయ్ జైన్‌ తమకు హామీ ఇచ్చారని సచివాలయ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు జానీప్రకటన చేశారు.

తమ ఉద్యోగుల సమాఖ్య తరఫున అజయ్‌ జైన్‌ ను కలిసి.. ఉద్యోగుల సమస్యలపై వినతులు కూడా అందజేసినట్లు తెలిపారు. ఉద్యోగులకు శాఖాపరమైన పరీక్షల్లో ప్రశ్న పత్రాలు కొంచెం కఠినంగా ఉన్నాయని… పేపర్‌ కోడ్‌ 8, 10 లో అర్హత మార్కులు 40 కి బదులుగా 25కి తగ్గించాలని కూడా కోరినట్లు చెప్పుకొచ్చారు.

పరీక్షల్లో ఉత్తీర్ణులవని.. 1750 మంది గ్రేడ్‌ 5 కారదర్శుల ప్రొబేషన్‌ కు సంబంధించిన పరీక్ష కూడా మరోసారి నిర్వహించాలని కోరామన్నారు. జూన్‌ 30 లోగాఉద్యోగుల ప్రొబేషన్‌ ఖరారు చేసేలా తగు చర్యలు తీసుకుంటున్నామని తమకు తెలియజేశారని చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version