ఇంజనీరింగ్‌ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. లక్షల్లో జీతం.. ఖాళీల వివరాలు ఇవే..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వానికి చెందిన బెంగళూరు మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ పలు పోస్టులు ఖాళీ వున్నాయి. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చెయ్యచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే.. మొత్తం 68 పోస్టులు ఖాళీగా వున్నాయి. డిప్యూటీ చీఫ్‌ ఇంజినీర్‌, ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌, అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌, అసిస్టెంట్‌ ఇంజినీర్‌ పోస్టుల కి ఆసక్తి వున్నా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు.

ఈ పోస్టుల కి అప్లై చెయ్యాలని అనుకునే వాళ్ళ వయసు 40 నుంచి 55 యేళ్ల మధ్య ఉండాలి. సిగ్నలింగ్‌, రోలింగ్‌ స్టాక్‌, టెలికమ్యునికేషన్‌, ట్రాక్షన్‌, ఈసీఎస్‌, డిపో మెషినరీ, ఆపరేషన్‌ సేఫ్టీ మొదలైన విభాగాల్లో ఈ పోస్టులు వున్నాయి. ఇక అర్హత వివరాలని చూస్తే.. యూనివర్సిటీ నుంచి సంబందిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌/ఇంజనీరింగ్‌ డిగ్రీ/డిప్లొమా లేదా మరేదైనా కోర్సు పూర్తి చేసి ఉండాలి.

ఏప్రిల్‌ 17, 2023వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ విధానంలో ఈ పోస్టుల కి అప్లై చెయ్యచ్చు. షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూలో మెరిట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇక సాలరీ విషయానికి వస్తే.. ఇంజినీర్‌ పోస్టులకు నెలకు రూ.1.4 లక్షలు జీతంగా చెల్లిస్తారు. ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ పోస్టులకు రూ.85,000 జీతంగా ఇస్తారు. అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ పోస్టులకు నెలకు రూ.65,000 జీతంగా ఇస్తారు. అసిస్టెంట్‌ ఇంజినీర్‌ పోస్టులకు అయితే రూ.50,000 జీతంగా చెల్లిస్తారు. పూర్తి వివరాలని https://english.bmrc.co.in/#/career లో చూడచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version