హైదరాబాద్ త్వరలోనే లక్ష బెడ్ రూం ఇండ్లు ఇస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. మలక్ పెట్ అసెంబ్లీ నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించారు మంత్రి కేటీఆర్. ఈ కార్యక్రమంలో అసద్దుద్దీన్ ఒవైసీ, మంత్రి మహమ్మద్ అలీ , మ్మెల్యేలు బలాల, దానం నాగేందర్ ,హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో అభివృద్ధి పై ఇటీవల సమీక్ష చేశామని.. కేసీఆర్ నాయకత్వంలో పాత, కొత్త నగరం తేడా లేకుండా అభివృద్ధి జరుగుతోందన్నారు. డబల్ బెడ్ రూమ్, ఫ్లై ఓవర్ లు …ఇలా అన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఇవాళ ప్రారంభించుకున్న ఇండ్లు.. ప్రైవేట్ బిల్డర్ కడితే 30 లక్షలు అవుతాయని… కానీ ప్రభుత్వం ఉచితంగా ఇస్తోందని తెలిపారు.
ప్రగతి భవన్ లో ఏ లిఫ్ట్ ఉందో…అదే కంపెనీ లిఫ్టు ఈ ఇళ్లలో ఉందన్నారు. నాణ్యతతో రాజీ పడకుండా నిర్మాణం చేపట్టామని… చెంచల్ గూడ 34 ఎకరాల్లో ఉందన్నారు. వరంగల్ సెంట్రల్ జైలు తరలించాలని కోరుతున్నారని….దీనిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతామని తెలిపారు. ప్రజలకు సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం వెనుకకు పోదని హామీ ఇచ్చారు..