నిరుద్యోగులకు శుభవార్త.. నీతి ఆయోగ్ లో కాంట్రాక్ట్ పద్ధతిలో ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ మేరకు ‘ది నేషనల్ ఇన్‌స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా (నీతి ఆయోగ్) నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగాల్లో పీజీ డిగ్రీతోపాటు తగు అనుభవం ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. మొత్తం 39 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. సీనియర్ రీసెర్చ్ ఆఫీసర్, రీసెర్చ్ ఆఫీసిర్, ఎకనామిక్ ఆఫీసర్, డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొంది. ఈ పోస్టులకు ఆప్లై చేయటానికి ఆన్ లైన్ లో ఇప్పటికే సంస్థ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించింది. డిసెంబర్ 24ను తేది వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపింది.
పోస్టులు, విద్యార్హత వివరాలు:
ఎకనామిక్ ఆఫీసర్: 12 పోస్టులు, ఎకనామిక్స్, అప్లైడ్ ఎకనామిక్స్, బిజినస్ ఎకనామిక్స్ లలో ఏదైనా యూనివర్సిటీ పీజీ చేసిన వారు ఈ పోస్టుకు దరఖాస్తు చేయడానికి అర్హులు
డైరెక్టర్:11 పోస్టులు
సీనియర్ రీసెర్చ్ ఆఫీసర్/ రీసెర్చ్ ఆఫీసర్: 13 పోస్టులు, ఎదైనా డీగ్రి పూర్తి చేసిన వాళ్లు అర్హులు
డిప్యూటీ డెరెక్టర్- జనరల్- 3 పోస్టులు
జీతాల వివరాలు..
ఎకనామిక్ ఆఫీసర్: ఎంపికైన వారికి రూ. 85 వేల వరకు వేతనం ఉంటుంది
డైరెక్టర్: రూ. 2,15,900 వరకు వేతనం ఉంటుంది.
సీనియర్ రీసెర్చ్ ఆఫీసర్: రూ. 1.25 లక్షల వరకు వేతనం ఉంటుంది
రీసెర్చ్ ఆఫీసర్: రూ.1.05లక్షల వేతనం ఉంటుంది.
డిప్యూటీ డెరెక్టర్- జనరల్: రూ. 2.65 లక్షల వరకు వేతనం ఉంటుంది.
మరిన్ని వివరాలు కోసం niti.gov.in వెబ్ సైట్ ను సందర్శించాండి.
పై పోస్టులకు ఆప్లై చేయటానికి ఈ లింక్ పై క్లిక్ చేయాండి
https://niti.gov.in/career/vacancy-circular