నిరుద్యోగులకు గుడ్ న్యూస్..ఎల్‌ఐసీ‌లో భారీగా ఉద్యోగాలు

-

నిరుద్యోగులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ LIC లో కీలక విభాగం హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (HFL).. జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.అర్హులైన అభ్యర్థులు www.lichousing.com విజిట్ చేసి అప్లై చేసుకోవాలి. ఈ పరీక్ష గడువు ఆగస్టు 14న ముగుస్తుంది.

ఖాళీల వివరాలు:

ఈ నోటిఫికేషన్‌లో రాష్ట్రాల వారీగా ఖాళీలను ప్రకటించింది. మొత్తంగా 200 జూనియర్ అసిస్టెంట్ భర్తీ చేస్తుండగా,అందులో ఆంధ్ర ప్రదేశ్ నుంచి 12, తెలంగాణ నుంచి 31 పోస్టులు ఉన్నాయి.

అప్లికేషన్ ఫీజు:

క్యాండిడేట్స్ అప్లికేషన్ ఫీజుగా రూ.800+ 18శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.

ఏజ్ లిమిట్:

వయసు కనీసం 21 సంవత్సరాలు, గరిష్టంగా 28 సంవత్సరాలలోపు ఉండాలి.

విద్యార్హత :

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా ఫీల్డ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. అందులో కనీసం 60 శాతం మార్కులు వచ్చి కంప్యూటర్ ఆపరేటింగ్ నాలెడ్జ్ తెలిసి ఉండాలి.

సెలక్షన్ ప్రాసెస్

 

అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ 2 దశల్లో ఉంటుంది. మొదటి దశలో ఆన్ లైన్ రాత పరీక్ష రెండో దశలో ఇంటర్వ్యూ ఉంటుంది. రాత పరీక్ష సెప్టెంబర్‌లో జరుగుతుంది.

 

శాలరీ :

 

నెలకు జీతం రూ.32,000 నుంచి 35,200 మధ్య లభిస్తుంది. ఇందులో అలవెన్సులు, ఇతర ప్రయోజనాలు కలిసి ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version