తెలంగాణ ఆర్టీసీ ప్రయాణీలకు ఎండీ సజ్జనార్ గుడ్ న్యూస్ చెప్పారు. హైదరాబాద్ లో ఉన్న సీబీఎస్ నుంచి మహత్మ గాంధీ బస్ స్టేషన్ వరకు ప్రయాణించడానికి ఎలాక్ట్రానిక్ వాహనాలను ప్రారంభించింది. అయితే ఈ ఎలాక్ట్రానికి వాహనాల సేవలు పూర్తి గా ఉచితం అని టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటించారు. ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఈ ఎలాక్ట్రానికి వాహానాల ఉచిత సర్వీస్ లు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
అయితే సీబీఎస్ నుంచి ఎంజీబీఎస్ కు ప్రయాణీకులు వెళ్లడానికి నానా ఇబ్బందులు పడుతారు. అక్కడ ఎక్కువ రద్దీ ఉండటం తో పాటు రోడ్డు దాటడం వంటివి ఇబ్బందికరంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఈ ఎలాక్ట్రానికి వాహానాల ఫ్రీ సర్వీస్ ను ప్రారంభించినట్టు ఎండీ సజ్జనార్ తెలిపారు. కాగ ఈ ఎలాక్ట్రానికి వాహనంలో మొత్తం 12 మంది ప్రయాణి చేయడానికి వీలుగా ఉంటుంది. అయితే ఈ ఉచిత సర్వీసులలో మొదటి ప్రాధాన్యత వృద్ధులు, వికలాంగలు, గర్భిణులు, రోగులకు ఉంటుంది.