ఏలూరు వాసులకి గుడ్ న్యూస్… ఈరోజే ప్రకటన ?

-

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోన్న అంతు చిక్కని వింత వ్యాధి గుట్టు నేడు తేలిపోనుంది. వివిధ రకాల శాంపిల్స్‌ కు సంబందించిన ఢిల్లీ ఎయిమ్స్‌ రిపోర్ట్స్‌ ఇవాళ రానున్నాయి. దీంతో ఈ వ్యాధికి కారణాలేంటన్న అంశాలు తేలి పోనున్నాయి. ఈ నెల 5న ఏలూరులో వింత వ్యాధి సోకడంతో… వందల సంఖ్యలో జనాలు ఆస్పత్రిలో చేరారు. మూడు రోజుల్లోనే ఆ సంఖ్య 600 దాటింది.

ఫిట్స్‌ రావడంతోపాటు… స్పృహ కోల్పోవడం, వాంతులు, కడుపులో నొప్పి, నరాలు లాగడం, నురక కక్కడంలాంటి లక్షణాలతో జనాలు ఆస్పత్రుల్లో చేరారు. ఏలూరులో  మూడు రోజులుగా వింత వ్యాధి కేసులు నమోదు కాలేదు. ఈ వ్యాధి నుంచి ఏలూరు బయటపడినట్లుగా అధికారులు ప్రకటించే అవకాశం ఉండని అంటున్నారు.  వింత రోగానికి కారణాలపై నేడు నివేదికలు ఇవ్వనున్న పలు పరిశోధన సంస్థలు.  మధ్యాహ్నం మూడుగంటలకు సీయం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. అనంతరం వింతవ్యాధికి కారణాలు వెల్లడించనుంది ఏపీ ప్రభుత్వం.

Read more RELATED
Recommended to you

Exit mobile version