అన్నదాతలకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..!

-

రైతుల కోసం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు పలు రకాల స్కీమ్స్ ని తీసుకు వస్తూ వుంటారు. వీటి వలన రైతులకి ఆర్ధిక ప్రయోజనం లభిస్తుంది. అయితే తెలంగాణ ప్రభుత్వం రైతులకి రైతుబంధు కింద డబ్బులని ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే పెట్టుబడి సాయం కింద యాసంగి సీజన్‌కు సంబంధించి డబ్బులని ఈరోజు నుండి అన్నదాతల ఖాతాల్లో జమ చేయనున్నారు.

ఎకరం పొలం ఉన్న రైతులకు మొదలుపెట్టి సంక్రాంతికి అందరి ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇప్పటికే రూ.7,676 కోట్ల నిధులను విడుదల చేయడం జరిగింది. 70.54 లక్షల మంది రైతులకు రైతుబంధు ప్రయోజనాన్ని పొందారు. ఈ నెల 28 నుంచి అనగా నేటి నుండి ఈ డబ్బులు అందించాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.

కేసీఆర్ ఆదేశాల తో నేటి నుండి డబ్బులు అందించాలని అధికారులు అంతా సిద్దం చేసుకున్నారు. మొదట రెండు ఎకరాల్లోపు పొలం ఉన్న రైతుల అకౌంట్ లో డబ్బులు పడతాయట. అయితే సిరిసిల్ల జిల్లా రైతులకు వారం రోజుల ముందుగానే రైతబంధు డబ్బులను ఇచ్చారు. ఇదిలా ఉంటే కరీంనగర్ జిల్లా రైతులు ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి జనవరి 7 వరకు అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. కొత్తగా దరఖాస్తు చేసుకున్నా కూడా డబ్బులని పొందొచ్చు. యాసింగ్ సీజన్‌కు ఎకరానికి ఐదు వేలు రైతులకి ఇస్తున్నారు. ఈ స్కీమ్ కింద ప్రతి ఏడాది ఎకరానికి రూ.10 వేల చొప్పున రైతులకి ప్రభుత్వం ఇస్తోంది. ఇప్పటి వరకు తొమ్మది విడతల డబ్బులు అందాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version