కామన్వెల్త్ గేమ్స్ నిన్న అంగరంగ వైభవంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే.. కామన్వెల్త్ గేమ్స్ తొలి రోజు భారత్ శుభారంభం చేసింది. 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ స్విమ్మింగ్‌లో భారత స్విమ్మర్ శ్రీహరి నటరాజ్ సెమీఫైనల్స్‌కు చేరుకున్నాడు. పాకిస్థాన్ బాక్సర్ సులేమాన్ బలోచ్‌తో జరిగిన 63 కేజీల బౌట్‌లో భారత బాక్సర్ శివథాపా 5-0తో ఓడించి తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్నాడు. భారత మహిళల టీటీ జట్టు గ్రూప్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను 3-0తో ఓడించింది. శ్రీజ ఆకుల-రీత్ టెన్నిసన్‌తో కూడిన డబుల్స్ జట్టు లైలా ఎడ్వర్డ్స్-డేనిషా జయవంత్ పటేల్‌తో కూడిన జట్టును వరుస సెట్లలో ఓడించింది.
శ్రీజ అకుల మరియు రీత్ టెన్నిసన్ డబుల్స్ జట్టు లైలా ఎడ్వర్డ్స్ మరియు డానీషా జయవంత్ పటేల్‌లను వరుస గేమ్‌లలో ఓడించింది. స్టార్ టీటీ ప్లేయర్ మనీకా బాత్రా.. ముష్ఫిక్ కలామ్‌ను 11-5, 11-3, 11-2తో మట్టికరిపించింది. ఆ తర్వాత డేనిష్ జయవంత్‌ను శ్రీజ ఆకుల ఓడించింది. అయితే, భారత్‌కు తొలి రోజు కొన్ని పరాజయాలు కూడా తప్పలేదు. స్విమ్మింగ్ (50 మీటర్ల బటర్‌ఫ్లై, 400 మీటర్ల ఫ్రీ స్టైల్), సైక్లింగ్ ఈవెంట్స్‌లో పరాజయాలు మూటగట్టుకుంది.