చాలామంది పిల్లలు తల్లిదండ్రులతో సమయాన్ని గడపాలని కోరుకుంటూ వుంటారు. అందులోనూ ఇది వేసవికాలం ఇప్పుడు సెలవులు ఉంటాయి ఇలాంటి సమయంలో తల్లిదండ్రులతో ఎక్కువ సమయాన్ని పిల్లలు గడపాలని అనుకుంటారు. తల్లిదండ్రులకి కూడా పిల్లలతో ఎక్కువ సమయాన్ని గడపాలని ఉంటుంది మీ పిల్లలని స్మార్ట్ ఫోన్ కి బానిసలు చేయకండి మీ పిల్లలని స్మార్ట్ ఫోన్ నుండి దూరంగా ఉంచండి. మీ పిల్లల్ని ఆక్టివ్ గా ఉంచాలంటే ఈ టిప్స్ బాగా హెల్ప్ అవుతాయి. మీ పిల్లలతో ఆనందంగా గడపచ్చు పైగా ఫోన్ తో సమయాన్ని స్పెండ్ చేయరు. మరి ఇక చక్కగా పిల్లలతో సమయాన్ని స్పెండ్ చేయడానికి మార్గాలని చూసేద్దాం..
సరదాగా బయటికి తీసుకువెళ్లండి..
మీకు దగ్గరలో ఉండే ప్రదేశాలకి సరదాగా మీ పిల్లల్ని తీసుకు వెళ్ళండి. మీ పిల్లలు చక్కగా ఆనందంగా చూస్తారు. ఉదాహరణకి పంట పొలాలు కానీ పార్కులు కానీ లేకపోతే పక్షులు వుండే చోటు, జూ ఇలా ఏదైనా మంచి ప్రదేశాలు మీ చుట్టుపక్కల ఉంటే అక్కడికి తీసుకువెళ్లి సరదాగా వాళ్ళతో టైం స్పెండ్ చేయండి. వాళ్ళకి నచ్చుతుంది పైగా మీరు కూడా ఆనందంగా ఉంటారు.
పక్షులు ఉన్నచోటికి..
ఇక్కడకి కూడా వెళ్ళచ్చు. ఎక్కువ పక్షులు ఉన్నచోటకి తీసుకువెళ్లి ఆనందంగా గడపవచ్చు. లేదంటే పార్కులు ఉంటే కూడా తీసుకు వెళ్ళండి.
ఇంట్లో గార్డెనింగ్ చేయండి..
పాత సామాన్లు ఉదాహరణకి పాత కాఫీ కప్పులు, జగ్గులు, మగ్గులు ప్లాస్టిక్ కప్స్ ఇటువంటివి ఉంటే వాటిలో మీరు మొక్కలు నాటొచ్చు. మీ పిల్లలు కూడా మీతో పాటుగా ఎంజాయ్ చేస్తారు.
కార్డ్ గేమ్స్, బోర్డు గేమ్స్ వంటివి..
ఇలాంటివి కూడా మీరు ఆడుకోవచ్చు. బోర్డ్ గేమ్స్ యునో కార్డ్స్ వంటివి మీరు సరదాగా మీ పిల్లలతో ఆడొచ్చు. బొమ్మలు వేయడం వంటివి కూడా చేయొచ్చు. ఇంట్లో ఉండే చెత్తని కలెక్ట్ చేయడం వంటివి కూడా మీరు ఫన్నీగా మీ పిల్లలతో పాటు చేయొచ్చు.
పిల్లలతో కలిసి వంట చేయడం..
ఇటువంటివి కూడా సరదాగా ఉంటాయి. అయితే ఇక్కడ పొయ్యి తో జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న వంటలు మాత్రమే వాళ్ళతో చెయ్యండి.
సరదాగా రోడ్డు ట్రిప్ కూడా వేయొచ్చు..
దగ్గర్లో ఉండే ఏదైనా ప్రదేశానికి రోడ్డు ట్రిప్ వేసేయొచ్చు ఇది కూడా అందరికీ నచ్చుతుంది.
చదువుతూ ఆట..
ఫన్నీ ప్రశ్నలు అడగడం, పజిల్స్, క్రాస్ వర్డ్ వంటివి కూడా బాగుంటాయి. ఇలా కూడా మీరు సరదాగా స్పెండ్ చేయొచ్చు. ఇలా మీరు మీకు నచ్చిన విధంగా అనుసరిస్తే పిల్లలు హ్యాపీగా ఉంటారు మీకు కూడా ఆనందంగా ఉంటుంది.