గూగుల్ పిక్సెల్ 7 ప్రో వీడియో లీక్.. డిజైన్‌ అదిరిందిగా..!

-

గూగుల్ పిక్సెల్ 7 ప్రోకు సంబంధించిన వివరాలు మళ్లీ ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. దీనికి సంబంధించిన అన్‌బాక్సింగ్ వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. అన్‌బాక్స్ అయింది బ్లాక్ కలర్ ఫోన్ కాగా దాని వెనకవైపు జీ లోగోను కూడా చూడవచ్చు. ఇంకా లీకైన వివరాలు ఇలా ఉన్నాయి..
ఈ స్మార్ట్ ఫోన్ ఆన్‌లైన్‌లో కనిపించడం ఇది రెండోసారి కావడం విశేషం. ఈ రెండిటినీ గూగుల్ ఐవో 2022 సదస్సులో ప్రకటించారు. వీటి డిజైన్ చూడటానికి పిక్సెల్ 6, పిక్సెల్ 6 ప్రో తరహాలోనే ఉండనుంది. దీనికి సంబంధించిన వీడియోలో గూగుల్ పిక్సెల్ 7 ప్రో బ్లాక్ కలర్‌లో ఉంది. దీని వెనకవైపు గ్లాస్ డిజైన్‌తో అందించారు. గూగుల్ ఐవో 2022 సదస్సులో కూడా ఇదే డిజైన్‌తో ఈ ఫోన్ టీజ్ చేశారు. ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ఒకటి టెలిఫొటో సెన్సార్ అయ్యే అవకాశం ఉంది.
గూగుల్ పిక్సెల్ 7 వెనకవైపు జీ లోగో చూడవచ్చు. ఫోన్ బూట్ అయినప్పుడు గూగుల్ అధికారిక యానిమేషన్ సీక్వెన్స్ కనిపిస్తుంది. ఇది తప్ప షేర్ చేయదగ్గ సమాచారం ఏదీ అందులో కనిపించలేదు. గూగుల్ పిక్సెల్ 7 సిరీస్ వీడియో లీక్ అవ్వడం ఇది రెండోసారి. ఈ సంవత్సరం ప్రారంభంలో గూగుల్ పిక్సెల్ 7, పిక్సెల్ 7 ప్రోలు లాంచ్ చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. వీటితో పాటు పిక్సెల్ వాచ్ కూడా లాంచ్ కానుంది.
గూగుల్ పిక్సెల్ 6ఏ ఇటీవలే మనదేశంలో లాంచ్ అయింది. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై గూగుల్ పిక్సెల్ 6ఏ పనిచేయనుంది. ఆక్టాకోర్ గూగుల్ టెన్సార్ చిప్‌సెట్, టైటాన్ ఎం2 సెక్యూరిటీ కోప్రాసెసర్లను గూగుల్ అందించింది. ఇందులో 6.1 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
ఇక కెమెరాల విషయానికి వస్తే… 
ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 12.2 మెగాపిక్సెల్ కాగా… 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version