ఆ హీరోయిన్ ప్రేమలో మునిగితేలిన గోపీచంద్.. కట్ చేస్తే..!!

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరో గోపీచంద్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. జయం, వర్షం, నిజం వంటి సినిమాల ద్వారా తెలుగు తెరకు విలన్ గా పరిచయమయ్యి.. హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకున్న ఈయన అనూహ్యంగా హీరోగా యూటర్న్ తీసుకొని.. యజ్ఞం సినిమా ద్వారా హీరోగా అవతారం ఎత్తాడు. ఇక ఆ సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో తదుపరి సినిమాలో కూడా హీరో గానే నటించాలని ప్రయత్నం చేశారు. ఇక తర్వాత కథల ఎంపిక విషయంలో తడబాటుపడ్డ గోపీచంద్.. చివరికి గోపీచంద్ స్టార్ హీరోగా నిలదొక్కుకోలేకపోవడం గమనార్హం. ఇకపోతే ఇప్పటికీ కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఒక్క సరైన హిట్టు కూడా పడకపోవడమే ఆశ్చర్యకరమని చెప్పాలి

ఇదిలా ఉండగా గోపీచంద్ గతంలో ఒక స్టార్ హీరోయిన్ తో ప్రేమలో పడి మునిగితేలాడట. అయితే ఇది వన్ సైడ్ లవ్ మాత్రమే కావడం ఆశ్చర్యకరం. నిజానికి ప్రేమ అంటే నమ్మని గోపీచంద్ హీరోయిన్ స్నేహ విషయంలో మాత్రం ప్రేమలో పడ్డాడు. కానీ ఆమెకు అతనిపై ఉన్న అభిప్రాయంతో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఒకరోజు స్నేహ గోపీచంద్ ని చూసి ఇతడు నాకు అన్నలా అనిపిస్తున్నాడని , ఇతడి సినిమాలో హీరోయిన్గా నటించడం ఏంటి అని సినిమా సెట్ లో చెప్పడంతో.. ఈ విషయం గోపీచంద్ ను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక తాను ప్రేమించే అమ్మాయి ఇలా అనేసరికి ..తాను ప్రేమిస్తున్న విషయాన్ని కూడా ఆమెకు చెప్పాలని చూసినా సరే ఆమెకున్న అభిప్రాయం చూసి వద్దు అనుకున్నాడు. ఇక అలా స్నేహా ని ప్రేమించి చివరికి తన అభిప్రాయాన్ని మార్చుకోవడం జరిగింది.

ఆ తర్వాత శ్రీకాంత్ బంధువైన రేష్మ అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం సినిమాలపై ఫోకస్ పెట్టి వరుస విజయాలు అందుకునే ప్రయత్నం చేస్తున్నారు హీరో గోపీచంద్. మరి ఏ మేరకు సక్సెస్ అవుతారో తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version