బ్రేకింగ్:ఉస్మానియా ఆస్పత్రిపై ప్రభుత్వం సంచలన నిర్ణయం

-

ఇటీవల ఉస్మానియా ఆస్పత్రి పాత భవనంలోకి నీళ్ళు రావడం దేశ వ్యాప్తంగా సంచలనం అయిన సంగతి తెల్సిందే. ఈ ఆస్పత్రిలోకి నీళ్ళు వచ్చిన ఘటనపై అటు మానవ హక్కుల సంఘం కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపధ్యంలోనే పాత భవనాన్ని వెంటనే ఖాళీ సీల్ వేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. పాత భవనంలోని శాఖలను షిఫ్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసారు.

ఆదేశాలు ఇచ్చిన డీఎంఈ సురేష్ రెడ్డి… వెంటనే చర్యలు తీసుకోవాలని, ఏ మాత్రం ఆలస్యం చేయవద్దని తన ఆదేశాల్లో స్పష్టం చేసారు. ఇటీవల ఆస్పత్రిలోకి భారీగా వరద రావడంతో తీవ్ర విమర్శలు వచ్చిన నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆస్పత్రిలో పలు వార్డుల్లోకీ భారీగా వరద నీరు చేరడం, అది మురికి నీరు కావడంతో అక్కడ ఉన్న రోగులు నానా ఇబ్బందులు పడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version