తెలంగాణలో ఎవరూ కరోనాతో చనిపోకూడదని.. అదే తన లక్ష్యమని గవర్నర్ తమిళిసై అన్నారు. ప్లాస్మా థెరపీ ద్వారా సీరియస్‌గా ఉన్న కరోనా బాధితులను రక్షించవచ్చని చెప్పారు. ఈఎస్‌ఐ ఆసుపత్రిలో శనివారం ప్లాస్మా బ్లడ్ బ్యాంకును సందర్శించిన గవర్నర్ ఈఎస్‌ఐ ఆస్పత్రిలో ప్లాస్మా థెరపీకి సంబంధించిన అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయని తెలిపారు. కరోనా పాజిటివ్ వచ్చి తగ్గిన వారు ప్లాస్మాను డొనేట్ చేయాల్సిందిగా పిలుపునిచ్చారు.
Hyderabad:Telangana Governor Tamilisai Soundararajan inspected plasma therapy arrangement at ESIC Medical College.She said,"#COVID19 survivors who're eligible to donate plasma should come forward&donate so that no patient in Telangana loses life due to shortage of plasma."(18.07) pic.twitter.com/XAn0gbKUtj
— ANI (@ANI) July 18, 2020
అయితే, అందరూ ప్లాస్మాను దానం చేసేందుకు అవకాశం లేదని, వైద్యులు నిర్ధారించినవారి నుంచే ప్లాన్మా సేకరిస్తారు. ప్లాస్మా డోనర్స్‌ని ఒక వేదిక మీదకు తీసుకురావాలి. అలాగే కరోనా లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలి. కరోనా వైరస్‌తో ఎవరూ ప్రాణాలు కోల్పోకూడదు. అందరూ రోగ నిరోధక శక్తి పెంచుకోవాలి’ అని పేర్కొన్నారు.