కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ఉన్నతవిద్యలో నూతన విద్యావిధానంపై ఈరోజు కీలక సమావేశం జరుగనుంది. ఉదయం 10:30గంటలకు అన్నిరాష్ట్రాల గవర్నర్లు, విద్యాశాఖామంత్రులు, వైస్‌ఛాన్స్‌లర్లతో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సమావేశం అత్యంత కీలకంగా మారనుంది. ఇప్పటికే నూతన విద్యావిధానంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ నూతన విద్యా విధానాన్ని కొన్నివర్గాలు వ్యతిరేకిస్తున్నాయి.
అయితే.. ఈ విధానంతో కేంద్రప్రభుత్వం హిందుత్వ భావజాలాన్ని మాత్రమే పెంపొందించేందుకు ప్రయత్నం చేస్తోందని కొందరు ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జరగుతున్న గవర్నలర్ల వీడియోకాన్ఫరెన్స్‌పై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రధానంగా రాష్ట్రపతి, ప్రధాని మోడీ ఏం మాట్లాడుతారోనని ఎదురు చూస్తున్నారు.