కులగణన జాబితాలో లేకున్నా…అర్హత ఉన్నవాళ్లకు రేషన్ కార్డులు ఇస్తామని ప్రకటించారు తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇవాళ రేషన్ కార్డుల జారీపై తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. రేషన్ కార్డుల విషయంలో ఎవరు అపోహపడకండని కోరారు. గడిచిన పదేళ్ల బీఆర్‌ఎస్ పార్టీ పాలనలో ఇచ్చిన రేషన్ కార్డులు ఎన్నీ లెక్క చెప్పండి..? అంటూ చురకలు అంటించారు.
జనవరి 26 నుంచి మేము రేషన్ కార్డులు ఇస్తున్నామని…. ఇది నిరంతర ప్రక్రియ అన్నారు తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కుల గణన జాబితాలో ఉన్నా..లేకున్నా…అర్హత ఉన్న వాళ్లకు రేషన్ కార్డులు ఇస్తామని క్లారిటీ ఇచ్చారు తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రజాపాలన… గ్రామ సభలో పెట్టుకున్న దరఖాస్తులు పరిగణలోకి తీసుకుంటున్నామన్నారు. పరిమితి లేకుండా… అర్హులకు రేషన్ కార్డులు ఇవ్వబోతున్నామని కూడా తెలిపారు.