ప్రభుత్వ భూముల అమ్మకంపై కెసిఆర్ సర్కార్ మరో ముందడుగు..

-

ప్రభుత్వ భూముల అమ్మకాలకు కెసిఆర్ సర్కార్ మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రజా అవసరాలకు అవసరం లేని భూములను బహిరంగ వేలం ద్వారా విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వివిధ శాఖల పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములను అమ్మకానికి పెట్టనుంది ప్రభుత్వం. ఈ-వేలం ద్వారా పారదర్శకంగా భూములను అమ్మనుంది. అమ్మే భూములకు సంబంధించి ఎలాంటి న్యాయపరమైన వివాదాలు లేకుండా చర్యలు తీసుకుంది. ప్రభుత్వ భూముల అమ్మకాల విషయంలో కలెక్టర్లకు కీలక బాధ్యతలు అప్పగించింది సర్కార్. అమ్మకానికి పెట్టె భూములను మల్టీపర్పస్ జోన్ లుగా విభజించనుంది. కొనుగోలుదార్లకు అవసరమైన అన్ని రకాల అనుమతులు ఇవ్వనుంది.

అంతేకాదు.. భూముల విక్రయం కోసం కమిటీలు కూడా వేసింది సర్కార్. సీఎస్ అధ్యక్షతన స్టీరింగ్ కమిటీ వేయగా… న్యాయపరమైన చిక్కులు లేకుండా చూసేందుకు ల్యాండ్స్ కమిటీని నియమించింది. అనుమతుల కోసం అప్రూవల్ కమిటీ వేయగా…భూముల అమ్మకం పర్యవేక్షణ కోసం యాక్షన్ కమిటీని నియమించింది. అటు భూముల వేలం కోసం నోడల్ ఏజెన్సీలను ఏర్పాటు చేసింది సర్కార్.

Read more RELATED
Recommended to you

Exit mobile version