తెలంగాణ రైతులకు శుభవార్త..ఏప్రిల్ మూడో వారం నుంచి ధాన్యం కొనుగోళ్లు

-

తెలంగాణ రైతులకు కేసీఆర్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. యాసంగి ధాన్యం కొనుగోళ్లపై కీలక ప్రకటన చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. యాసంగి ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఏప్రిల్ మూడో వారం నుంచి ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఏప్రిల్ 21వ తేదీ నుంచి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేలా అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలు అందాయి. ఈ కార్యాచరణ పై ఏప్రిల్ 10వ తేదీన తెలంగాణ మంత్రులు గంగుల కమలాకర్, నిరంజన్ రెడ్డి మరియు మంత్రి హరీష్ రావు భేటీ కానున్నారు. ఈ సీజన్ లో 56 లక్షల వరి పంట సాగు అయింది. 1.40 కోట్ల మెట్రిక్ టన్నుల దిగుబడి ఉంటుందని అంచనా వేస్తోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయకున్నా… తమ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని పేర్కొంది కేసీఆర్ సర్కార్.

Read more RELATED
Recommended to you

Exit mobile version