ఘనంగా కేరింత మూవీ హీరోయిన్ నిశ్చితార్థ వేడుకలు.. ఫొటోస్ వైరల్..!

-

ఇటీవల కాలంలో హీరోయిన్లు ఒకరి తర్వాత ఒకరు వివాహం చేసుకుంటున్న విషయం తెలిసిందే ఈ క్రమంలోనే కేరింత సినిమా ద్వారా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకున్నా సుకృతి కూడా తాగా నిశ్చితార్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక అందుకు సంబంధించిన ఫోటోలు కూడా బాగా వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే తన పెళ్లి త్వరలోనే జరగబోతోందని తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా తన నిశ్చితార్థ ఫోటోలను షేర్ చేస్తూ.. తన తండ్రి ప్రేమ గురించి వెల్లడించింది.2017లో డైరెక్టర్ సాయికిరణ్ అడవి దర్శకత్వంలో వచ్చిన కేరింత సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది సుకృతి. ఇక ఈ సినిమాలో భావన పాత్రలో నటించి మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఈమె వరుస సినిమాలు చేస్తూ ఉంది అనుకుంటే ఒక్క సినిమాతోనే ఇండస్ట్రీకి దూరం కావడం గమనార్హం ఇక ఈ సినిమా తర్వాత సుకృతీ మరెక్కడా కూడా ఇండస్ట్రీలో కనిపించలేదు. ఇప్పటివరకు ఈమె జాడ కనిపించకపోవడంతో అభిమానులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు ఇక ఈ నేపథ్యంలో తాజాగా వివాహం చేసుకుంటున్నట్లు.. ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఫోటోలను కూడా ఆమె సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది.

ఇకపోతే కాబోయే భర్త త తో దిగిన ఫోటోలను షేర్ చేయగా ఆ విభాగ వైరల్ గా మారుతున్నాయి యొక్క ప్రేమ గురించి కూడా చాలా అద్భుతంగా రాసుకొచ్చింది. ఇక సుకృతి తన తండ్రి గురించి.. నా జీవిత ప్రపంచం మొత్తం మీరే నాన్న. ఎల్లప్పుడూ నా కోసం పోరాడుతూ వుంటారు.. నేను నిరాశ చెందినప్పుడు నన్ను ఉత్సాహపరుస్తారు. నేను భయపడినప్పుడు నా చేయి పట్టుకుని నడిపిస్తారు. నేను మరింత ముందుకు వెళ్లేందుకు సహకరిస్తారు. ఎల్లప్పుడూ ఉత్తమ తండ్రిగానే ఉన్నారు. నేను 5 సంవత్సరాల క్రితం నా తల్లిని కోల్పోయాను. అప్పటి నుంచి మా నాన్న నాకు తల్లి ప్రేమను సైతం పంచతున్నాడు. సింగిల్ పేరెంట్‌గా ఉండటం అంత సులభం కాదు. మీరు ఇవన్నీ చాలా అందంగా నిర్వహించారు పప్పా. మీరు నాకు తెలిసిన అత్యంత బలమైన వ్యక్తి. ఎప్పటికీ నువ్వే నా ఫస్ట్‌ లవ్‌ నాన్న..అంటూ ఎంతో గొప్పగా తన తండ్రి ప్రేమను వ్యక్తపరిచింది సుకృతి.

Read more RELATED
Recommended to you

Exit mobile version