శ్రీవారి భక్తులకు శుభవార్త.. సర్వ దర్శనం టికెట్ల పెంపునకు గ్రీన్ సిగ్నల్

-

ఇవాళ సమావేశం అయిన టిటిడి పాలకమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రూ.3096 కోట్ల అంచనాతో 2022-23 వార్షిక బడ్జేట్ కి ఆమోదం తెలిపింది. ముఖ్యంగా శ్రీవారి ఆలయంలో సర్వదర్శనం టిక్కేట్లు పెంపుకి నిర్ణయం తీసుకుంది టీటీడీ. అలాగే ఆర్జిత సేవలు ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్న టీటీడీ.. రూ. 230 కోట్ల రూపాయల వ్యయంతో పద్మావతి చిన్నపిల్లల మల్టి స్పేషాల్టి హస్పిటల్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకుంది.

స్విమ్స్ హస్పిటల్ ని పూర్తి స్థాయి అభివృద్ది చేస్తామని.. 2.7 కోట్ల రూపాయల వ్యయంతో స్వీమ్స్ హస్పిటల్ ని పూర్తిగా కంప్యూటికరణ చేయాలని టీటీడీ వెల్లడించింది. ఉద్యోగులుకు నగదురహిత వైద్య సేవలు అందించేందుకు 25 కోట్లు కేటాయింపు టీటీది.. తిరుమలలో అన్నప్రసాదాని మరిన్ని ప్రదేశాలలో భక్తులుకు ఉచితంగా అందించేందుకు నిర్ణయం తీసుకుంది.

అలిపిరి వద్ద సైన్సు సిటికి కేటాయించిన భూమిని వెనక్కి తీసుకోని ఆధ్యాత్మిక సిటి నిర్మిస్తామని.. నాదనీరాజనం మండపాని శాశ్వత ప్రాతిపాదికన నిర్మిస్తామని వెల్లడించింది. అన్నమయ్య మార్గాని భక్తులుకు సౌకర్యవంతంగా వుండేలా నడకమార్గంలా అభివృద్ది పర్చేలా చర్యలకు టీటీడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version