శరద్ పవార్ పార్టీకి ఊరట.. విరాళాల సేకరణకు గ్రీన్ సిగ్నల్

-

మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం ఊరటనిచ్చే కబురు చెప్పింది. ప్రజల నుంచి విరాళాలను స్వీకరించడానికి శరద పవార్ పార్టీకి అనుమతి ఇచ్చింది.

అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రజల నుంచి స్వచ్ఛందంగా విరాళాలను స్వీకరించేందుకు ఎన్నికల సంఘం అనుమతి కోరింది. దీనికి భారత ఎన్నికల సంఘం ఆమోదించింది. సుప్రియా సూలే నేతృత్వంలోని 8 మంది సభ్యులు సోమవారం ఎన్నికల సంఘాన్ని కలిసింది. వ్యక్తి లేదా కంపెనీ నుంచి స్వచ్చంధంగా విరాళాలు సేకరించేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేయగా.. అనుమతిని ఇచ్చింది. త్వరలోనే మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈసారి అధికారాన్ని కైవసం చేసుకోవాలని ఇండియా కూటమి భారీగా కసరత్తు చేస్తోంది. అలాగే సీఎం ఏక్‌నాథ్ షిండే సారధ్వంలోని ఎన్డీఏ కూటమి కూడా మరోసారి అధికారం ఛేజిక్కించుకోవాలని ప్రణాళికను రచిస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version