గ్రూప్‌-1 అభ్యర్థులకు అలర్ట్‌.. మరో రెండు రోజుల్లో ఫలితాలు

-

‘గ్రూప్‌-1’ అభ్యర్థులకు శుభవార్త.. తెలంగాణ తొలి ‘గ్రూప్‌-1’ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల వెల్లడికి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( TSPSC) కసరత్తు పూర్తి చేసింది. అయితే.. ఫలితాలు ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. TSPSC Group 1 ప్రక్రియపై ఇద్దరు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించడంతో ఎప్పుడో వెలువడాల్సిన ఫలితాలు వాయిదా పడ్డాయి. ఒకటి, రెండు రోజుల్లో కోర్టు కేసు కొలిక్కి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో రేపు లేదా ఎల్లుండి TSPSC Group 1 ప్రిలిమ్స్‌ ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను TSPSC ఇప్పటికే పూర్తి చేసిందని సమాచారం. తెలంగాణలో 503 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి గతేడాది అక్టోబర్‌ 16న టీఎస్‌పీఎస్సీ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే.

అక్టోబరు 29న ప్రాథమిక ‘కీ’ విడుదల చేసింది. అభ్యంతరాలను స్వీకరించి, నిపుణుల కమిటీతో చర్చించి, చివరికి 5 ప్రశ్నలను తొలిగించి, నవంబర్‌ 15న తుది ‘కీ’ని వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. ఆ తర్వాత రెండు, మూడు వారాల్లోనే ప్రిలిమ్స్‌ ఫలితాలు వెల్లడిస్తామని TSPSC ప్రకటించింది. గ్రూప్-1 పై ఇద్దరు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. దీంతో ఫలతాల వెల్లడి ప్రక్రియ ఆగిపోయిన విషయం తెలిసిందే. అభ్యర్థులు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని https://www.tspsc.gov.in/ వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version