మీ భార్య కోపాన్ని చల్లార్చాలా..? ఇలా చేస్తే సరి..!

-

పెళ్లయిన ప్రతి ఒక్కరికి కూడా గొడవలు వస్తూ ఉంటాయి. భార్యా భర్తల మధ్య రోజుకి ఏదో ఒక ఇబ్బంది తలెత్తుతూనే ఉంటుంది. ఒక రోజు హ్యాపీ గా ఉంటే ఇంకో రోజు కచ్చితంగా బాధ ఉంటుంది. అయితే భార్యా భర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుని ఒకరికొకరు తోడుగా ఉంటే కచ్చితంగా జీవితంలో ముందుకు వెళ్లడానికి అవుతుంది. అలానే ఒకరినొకరు గౌరవించుకోవడం కూడా చాలా ముఖ్యం.

ఒక్కొక్కసారి చిన్న చిన్న విషయాల వల్ల భార్యలకి కోపం కూడా వస్తుంది. మీ భార్య కూడా తరచూ కోపానికి గురవుతారా..? భార్యాభర్తల మధ్య ఆలకులు తగాదాలు ఉంటూ ఉంటాయి మీ భార్య కోపాన్ని తగ్గించాలంటే ఈ విధంగా ప్రయత్నం చేయండి. ఈజీగా కోపం తగ్గుతుంది.

ఒకసారి క్షమించమని అడగండి:

మీకు నచ్చకపోయినా ఒకసారి కోపాన్ని తగ్గించడానికి క్షమాపణ కోరండి. ఒకసారి క్షమాపణ అడిగితే మీ మధ్య బంధం మెరుగు పడుతుంది.

ఒంటరిగా వదిలేయండి:

మీరు క్షమించమని అడిగిన తర్వాత కాసేపు వదిలేయండి వాళ్ళు ఆలోచించుకోవడానికి సమయం ఇస్తే మళ్లీ తిరిగి మీ దగ్గరికి వస్తారు. కాబట్టి కొంచెం సమయం ఇవ్వండి.

మీరు వంట చేయండి:

ఆమె కోపం తగ్గే వరకు ప్రేమ ఎక్కువగా మీకు ఆమెపై ఉందని తెలిపేందుకు వంట చేసి పెట్టండి. దీనితో ఆమె ఆనందంగా ఉంటారు పైగా కోపం కూడా తగ్గుతుంది.

బహుమతులని ఇవ్వండి:

వాళ్లకి నచ్చినది కానీ వాళ్ళు ఏమైనా కొనుగోలు చేయాలనుకుంటే దానిని కానీ వారికి గిఫ్ట్ గా ఇవ్వండి ఇది కూడా ఆమెకి నచ్చుతుంది. కోపం తగ్గుతుంది.

షాపింగ్ కి తీసుకు వెళ్లండి:

మీ భార్య కోపం తగ్గాలంటే కాస్త షాపింగ్ కి తీసుకు వెళ్ళండి అలానే మీరు ఆమె కి ఎందుకు కోపం వచ్చింది అనేది తెలుసుకునే దానికి తగ్గట్టుగా నడుచుకోండి అలానే ఒకవేళ కనుక మీరు ఏదైనా తప్పు చేసి ఉంటే ఇంకెప్పుడూ అలా చేయనని చెప్పండి ఇలా మీ భార్య కోపాన్ని చల్లార్చచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version