పెళ్లి అనేది మనిషి జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకం.. అయితే.. ముహూర్తం బాగుంటే.. చాలా పెళ్లిళ్లు ఒకేసారి జరుగుతుంటాయి. అయితే.. తాజాగా నేడు ముహూర్తం బాగుండడంతో తెలుగు రాష్ట్రాల్లో అధిక సంఖ్యలో జంటలు ఏకమవబోతున్నాయి. అయితే.. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవులో గ్రామ సంప్రదాయం ప్రకారం గురువారం సామూహిక వివాహాలు వైభవంగా నిర్వహించారు.
రాత్రి 10.11 గంటలకు ఒకే లగ్నంలో 43 జంటలు వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యాయి. ఉదయం బృందావతి ఆలయంలో పూజలు నిర్వహించి, పెళ్లి బాజాల మధ్య కాబోయే వధూవరులకు మంగళస్నానాలు చేయించారు. మధ్యాహ్నం వధువులను సంప్రదాయ పెళ్లి దుస్తులతో అలంకరించి వారి వారి ఇళ్ల వద్ద ఏర్పాటు చేసిన పీటలపై కూర్చోబెట్టి బంధువులు కరెన్సీ నోట్లను తగిలిస్తూ అభినందనలు తెలిపారు.