జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నేడే.. కోవిడ్ కారణంగా పన్ను మినహాయింపులు

-

కేంద్ర ఆర్థిక మంత్రి అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నేడు జరగనుంది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులతో పాటు రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. కోవిడ్ మందులు, వైద్యం, టెస్టులు, మొదలగు వాటిపై పన్ను మినహాయింపుల విషయమై చర్చించనున్నారు. అంతే కాదు బ్లాక్ ఫంగస్ మందులపై పన్ను మినహాయింపులు చర్చకు రానున్నాయి.

ఈ విషయమై మంత్రివర్గ సభ్యులు మే 28వ తేదీన జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ముచ్చటించి కోవిడ్ వైద్యానికి, వ్యాక్సిన్లకు, బ్లాక్ ఫంగస్ మందులకు పన్నులు మినహాయించాలన్న రిపోర్టును జూన్ 7వ తేదీన సమర్పించారు. ఈ మినహాయింపులు ఏ రకంగా ఉండనున్నాయనేది ఈ రోజు తేలనుంది. వర్చువల్ గా సాగే ఈ మీటింగ్ కి కేంద్ర సహాయ ఆర్థిక మంత్రి అనురాగ్ ఠాకూర్ హాజరు కానున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version