ఏపీ రైతులకు శుభవార్త చెప్పారు సీఎం జగన్. వ్యవసాయ రంగంపై క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ…రైతులకు ఎరువులు అందించడంలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలి..ఎక్కడ నుంచి ఎలాంటి సమాచారం వచ్చినా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఆర్బీకేల్లో ఉన్న అగ్రికల్చర్ అసిస్టెంట్ నుంచి ప్రతి రోజూ నిరంతరం సమాచారం తెప్పించుకోవాలని…విత్తనాల సరఫరా, ఎరువుల పంపిణీ, వ్యవసాయ ఉత్పత్తులకు అందుతున్న ధరలు తదితర అంశాలపై నిరంతరం అగ్రికల్చర్ అసిస్టెంట్ ద్వారా తెప్పించుకోవాలన్నారు. ఇ– క్రాప్ వందశాతం పూర్తి చేయాలి..వైయస్సార్ ఉచిత పంటల బీమా పథకంతో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన భాగస్వామ్యం కానుందని వెల్లడించారు. రైతులకు గరిష్ట లబ్ధి చేకూర్చేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగం పై సమావేశంలో చర్చ జరుగగా…మాస్టర్ ట్రైనర్లను తయారు చేయాలని సందర్భంగా జగన్ పేర్కొన్నారు. డ్రోన్ల నిర్వహణ, మరమ్మతుపై శిక్షణ ఇచ్చే దిశగా చర్యలు తీసుకోవాలి..నియోజకవర్గానికి ఒక ఐటీఐ లేదా ఒక పాలిటెక్నిక్ కళాశాలలోని విద్యార్థులకు డ్రోన్ల వినియోగం, నిర్వహణ, మరమ్మతులపై సంపూర్ణ శిక్షణ ఇప్పించాలని దేశాలు జారీ చేశారు.