ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్, 1,681 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

-

ఏపీ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది జగన్మోహన్ రెడ్డి సర్కార్. వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ లలో సేవలు అందించడానికి 1,681 మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ (ఎం ఎల్ హెచ్ పి) పోస్టుల భర్తీకి వైద్య శాఖ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన నాటి నుంచి రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా వైద్య శాఖలో విప్లవాత్మక మార్పులు చేపడుతున్నాయి.

ఇందులో భాగంగా గ్రామాల్లోని ప్రజలకు వైద్య సేవలు చేరున చేయడానికి 10,032 వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ లు ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో సేవలందించడానికి భారీగా ఎం ఎల్ హెచ్ పి లను నియమిస్తున్నారు. ఇప్పటికే 8,351 పోస్టుల భర్తీ పూర్తయింది. మిగిలిన పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఈనెల తొమ్మిదవ తేదీ నుంచి 22వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించునున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఈనెల 24 నుంచి 30వ తేదీ వరకు హాల్ టికెట్లు జారీ చేస్తారు. సెప్టెంబర్ మొదటి వారంలో పరీక్ష నిర్వహిస్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version