గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గుర్తుమీద గెలిచిన పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆ మధ్యలో సీఎం రేవంత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు లోకల్ కాంగ్రెస్ పార్టీ నేతలతో పొసగడం లేదని తెలుస్తోంది. ఇప్పటికే ఆయన తీరుపై కాంగ్రెస్ అధిష్టానం సైతం గుర్రుగా ఉన్నట్లు సమాచారం.
ఈ క్రమంలోనే బడ్జెట్ సమావేశాల కోసం అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్‌తో మహిపాల్ రెడ్డి భేటీ అయ్యారు. ముందుగా కేసీఆర్ చాంబర్‌కు వెళ్లిన గూడెం కేసీఆర్‌ను కలిశారు.తన సోదరుడి కుమారుడి పెళ్లికి రావాలని ఆహ్వానించినట్లు సమాచారం. కాగా, గూడెం కేసీఆర్‌ను కలువడంతో మళ్లీ గులాబీ గూటికి వస్తారా? అనే చర్చ కాంగ్రెస్ పార్టీలో మొదలైంది.