ఈ రోజు కోటలో జరిగిన బహిరంగసభలో నారా లోకేష్ గూడూరు వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ పై చేసిన వ్యాఖ్యలపై వెంటనే ఆయన స్పందించారు. ఈయన మాట్లాడుతూ నారా లోకేష్ లాంటి జోకర్ మాటలు ఎవ్వరూ నమ్మరన్నారు, అంతే కాకుండా మాట్లాడే ముందు ఏమి మాట్లాడుతున్నామో అలోచించి మాట్లాడాలని హెచ్చరిక జరీ చేశారు. లోకేష్ నువ్వు మంత్రిగా పనిచేశావు, అయినప్పటికీ నీకు పరిపక్వత రాలేదు. నీకన్నా వయసులో పెద్దవారి గురించి ఎలా మాట్లాడాలో ముందు నేర్చుకో అని లోకేష్ ని గద్దించాడు. లోకేష్ ఇంకా నువ్వు రాజకీయంలో అంతగా అనుభవం లేని వ్యక్తివి మరియు వయసులోనూ చిన్నవాడివి.. అధికార మంత్రులు మరియు ఎమ్మెల్యేలు ఇంకా ప్రజాప్రతినిధుల గురించి మాట్లాడే ముందు నిజానిజాలు తెలుసుకుని మాట్లాడాలని చెప్పాడు.