గుజరాత్ లో దారుణం…10 రోజుల్లో ముగ్గురు చిన్నారులపై అత్యాచారం..కేకలు వేసింది ఓ చిన్నారి హత్య..!

-

గుజరాత్ లోని గాంధీనగర్ జిల్లాలో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. పది రోజుల వ్యవధిలో ఓ దుర్మార్గుడు ముగ్గురు చిన్నారులపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాకుండా కేకలు వేయడంతో మూడేళ్ల చిన్నారిని మార్చాడు. వివరాల్లోకి వెళితే… వన్సజాదా గ్రామానికి చెందిన 26 ఏళ్ల విజయ్ ఠాకూర్ అనే మానవ మృగం ఈ దారుణానికి పాల్పడింది. నిందితుడికి పెళ్లి కాగా భార్య కుమార్తె ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. ఇక నిందితుడు ఈనెల నాలుగవ తేదీన గ్రామానికి చెందిన ఐదేళ్ల బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు.

అత్యాచారం

ఆ తర్వాత రోజు రాత్రి మూడేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. చిన్నారి కేకలు వేయడంతో హత్య చేసి మృత దేహాన్ని ఓ కల్వర్టు లో పడేశాడు. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితున్ని అరెస్ట్ చేశారు. కాగా పోలీసుల విచారణలో పది రోజుల క్రితం ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేసినట్టు నిందితుడు ఒప్పుకున్నాడు. ఇక నిందితున్ని కఠినం గా శిక్షించాలని బహిరంగం గా ఉరి తీయాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version