గుజరాత్ కొత్త ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్

-

విజయ్ రూపానీ రాజీనామా అనంతరం గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎవరవుతారనే దానిపై మంచి చర్చ జరిగింది. ఈ కేంద్ర బీజేపీ నేతల పర్యవేక్షణలో శాసన సభాపక్ష సమావేశం కూడా జరిగింది. నలుగురి పేర్లు ప్రముఖంగా వినిపించాయి. ఆ నలుగురిలో ఎవరో ఒకరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని అనుకున్నారు. కానీ అనూహ్యంగా మరో కొత్త పేరు వెలుగులోకి వచ్చి ముఖ్యమంత్రి పదవిని చేజిక్కించుకుంది. గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ ఎన్నికయ్యారు.

గట్లోడియా నియోజకవర్గం నుండి ఎన్నికైన భూపేంద్ర పటేల్, తన ప్రత్యర్థిపై లక్షా 17వేల మెజార్టీతో నెగ్గాడు. ప్రస్తుతం గుజరాత్ ముఖ్యమంత్రిగా పీఠం దక్కించుకున్నారు. ఈ మేరకు బీజేపీ అధిష్టానం ప్రకటించింది. ఐతే నితిన్ పటేల్ సీఎమ్ అవుతాడని చాలామంది భావించారు. ఈ మేరకు నితిన్ పటేల్ మాట్లాడుతూ, అనుభవం ఉండి, భవిష్యత్తులో గుజరాత్ రాష్ట్రానికి మార్గనిర్దేశనం చేసే నాయకులు కావాలని అనుకున్నామని, అంతే తప్ప ముఖ్యమంత్రి సీటు ఖాళీ ఉంది, ఎవరో ఒకరు కూర్చోవాలని అనుకోలేదని నితిన్ పటేల్ కామెంట్ చేసారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version