ఐఆర్‌సీటీసీ టూరిజం ఇప్పటికే ఎన్నో టూర్ ప్యాకేజీలని తీసుకు వచ్చింది. తాజాగా ఐఆర్‌సీటీసీ మరో టూర్ ప్యాకేజీని తీసుకు వచ్చింది. విజయవాడ, విశాఖపట్నం నుంచి గుజరాత్‌కు టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి గుజరాత్‌కు టూర్ వెళ్లాలనుకునే వారికి ఇదే మంచి అవకాశం. ఇక ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..
11 రోజులు టూర్ ఇది. ఈ టూర్ ప్యాకేజీ ధర రూ.11 వేలు మాత్రమే. వైబ్రంట్ గుజరాత్ పేరు తో ఈ టూర్ ప్యాకేజీని తీసుకు వచ్చింది. ఈ టూర్ లో సోమనాథ్, ద్వారక, నాగేశ్వర్, బెట్ ద్వారక, అహ్మదాబాద్, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ లాంటి ప్రాంతాలు చూసి వచ్చేయచ్చు. ఈ టూర్ 2022 జనవరి 21న ప్రారంభం అవుతుంది.
2022 జనవరి 31న ముగుస్తుంది. పర్యాటకులు మొదటి రోజు విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని, విశాఖపట్నం, శ్రీకాకుళం రోడ్, పలాసలో రైలు ఎక్కాలి. నాలుగో రోజు సోమనాథ్ రీచ్ అవుతారు. సోమనాథ జ్యోతిర్లింగ దర్శనం అయ్యాక… ద్వారక బయల్దేరాలి. ఐదవ రోజు అయితే ద్వారాకాదీశ్ ఆలయంతో పాటు ఇతర ఆలయాలను చూడచ్చు.
బెట్ ద్వారక, నాగేశ్వర్ జ్యోతిర్లింగ దర్శనం ఆరో రోజు ఉంటుంది. తర్వాత వాత్వ బయల్దేరాలి. ఏడో రోజు వాత్వ చేరుకుంటారు. అక్కడ సబర్మతీ ఆశ్రమం, అక్షరధామ్ ఆలయం చూడచ్చు. ఎనిమిదో రోజు విశ్వామిత్ర్‌కు బయల్దేరాలి. నెక్స్ట్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి తీసుకెళ్తారు. తొమ్మిదో రోజు, పదో రోజు రైలు ప్రయాణం ఉంటుంది. పదకొండో రోజు మీ రైల్వే స్టేషన్ కి చేరుకుంటారు. పూర్తి వివరాలను https://www.irctctourism.com/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.