ఆర్‌కే పురం వద్ద గన్ కలకలం.. విచారణలో షాకైన పోలీసులు

-

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఆర్‌కే పురం వద్ద ఓ వ్యక్తి గన్‌తో తిరుగుతూ కనిపించాడు.ఓ వ్యక్తి తనకు అడ్డుగా వచ్చాడని గన్‌ తీసి అందరూ చూస్తుండగా.. మల్కాజిగిరి చెందిన వినోద్ కుమార్ అనే వ్యక్తి భయభ్రాంతులకు గురిచేశాడు. గమనించిన తోటి వాహనదారులు వెంటనే కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించారు.

దీంతో సికింద్రాబాద్ పరిధిలోని మారేడుపల్లి వద్ద వినోద్ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతన్ని స్టేషన్‌కు తరలించి విచారించగా పోలీసులు షాక్‌కు గురయ్యారు. అది చెర్రల గన్ (పిట్టల గన్)గా నిర్దారణకు వచ్చారు.దీంతో వినోద్ కుమార్‌కు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించినట్లు పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news