సీఎం కేసీఆర్ ఇంట తీవ్ర విషాదం..

-

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సీఎం కేసీఆర్‌ మేన మామ మరణించారు. కేసీఆర్‌ కు మేనమామ వరుస అయ్యేటు వంటి.. గునిగంటి కమలాకర్‌ రావు శనివారం రాత్రి కామారెడ్డి పట్టణంలోని.. దేవి విహార్‌ లో తన సొంత ఇంట్లో మృతి చెందారు. రాజంపేట మండలం అర్గొండ గ్రామానికి చెందిన కమలాకర్‌ రావు చాలా కాలంగా కామారెడ్డి పట్టణంలో నివసిస్తున్నారు.

ఆయన సంతానం అంతా హైదరాబాద్‌ లో ఉంటారు. కాగా.. 10 సంవత్సరాల కిందట.. కమలాకర్‌ రావు భార్య చనిపోయినప్పుడు దశదిన కర్మకు ఉద్యమ నేత గా ఉన్న కేసీఆర్‌.. హాజరయ్యారు. కామారెడ్డి లో పర్యటించిన ప్రతిసారి సీఎం కేసీఆర్‌ తన మేనమామ ఇంటికి బాల్యంలో అనేక సార్లు వచ్చేవాడినని.. అప్పుడు కామారెడ్డి గంజ్‌ లో బెల్లం వాసన గుప్పుమని వచ్చేదంటూ గుర్తు చేసుకునే వారు. కాగా… గునిగంటి కమలాకర్‌ రావు అంత్యక్రియలకు కేసీఆర్‌ కుటుంబమం నుంచి ఎవరూ కూడా హాజరు కాలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version