మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న మూడవ చిత్రం హిట్ అవుతుందా లేదా నిరాశపరుస్తుందా అన్న లెక్కల్లో ఫ్యాన్స్ ఉన్నారు. ఎందుకంటే వీరి కాంబోలో వచ్చిన రెండు సినిమాల్లో ఒకటి బ్లాక్ బస్టర్ కాగా , రెండవది యావరేజ్ గా నిలిచింది. కాగా ఈ సినిమా టైటిల్ ను ఫ్యాన్స్ ఎవ్వరూ ఓన్ చేసుకోలేకపోతున్నారు. త్రివిక్రమ్ లాంటి డైరెక్టర్ క్యాచీ గా లేని టైటిల్ ను ఎంచుకోవడం ఒకింత ఎన్నో సందేహాలను కలిగిస్తోంది, కాగా ఈ సినిమా నుండి ఒక మోస్ట్ ఇంటరెస్టింగ్ అప్డేట్ రానుందని మూవీ యూనిట్ సమాచారం ఇచ్చింది. తెలుస్తున్న సమాచారం ప్రకారం గుంటూరు కారం మూవీ నుండి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయడానికి ముహుర్తాన్ని ఖరారు చేశారట. వచ్చే వారం లో ఇండిపెండెన్స్ డే రానుండగా అదే రోజున మహేష్ బాబు సినిమా నుండి ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.
“గుంటూరు కారం” మూవీ నుండి స్పైసీ అప్డేట్ !
-