గుప్పెడంతమనసు 279 ఎపిసోడ్: మనసులో మాట బయటకు చెప్పలేక నలిగిపోతున్న రిషీ..నిశ్చితార్థానికి మొదలైన ఏర్పాట్లు

-

గుప్పెడంతమనసు ఈరోజు ఎపిసోడ్ లో రిషీ కషాయం తెచ్చి మహేంద్రకు ఇచ్చి తాగమంటాడు. మహేంద్ర ఇప్పుడు ఈ కషాయాలు అవసరమా అంటే…తాగండి మీ నీరసం అడ్రస్ లేకుండా పోతుంది తాగండి అంటూ ఇస్తాడు. పాపం మహేంద్ర భయం భయంగా ఒక సిప్ వేసి జగతి ఇచ్చే కషాయంలా ఉందే అనుకుంటాడు. ఇలాంటి కషాయం నేను ఎప్పుడో తాగినట్లుగుర్తు అని కొంచెం తాగుతాడు. అక్కడితో ఆ సీన్ అయిపోతుంది. మరుసటి రోజు ఉదయాన్నే వసూ వస్తుంది. రిషీ మనసులో పొగరేంటి ఫోన్ కాల్ లేకుండా వచ్చింది అనుకుంటాడు. దేవయాని ఏంటి పొద్దున్నే వచ్చావ్ అంటుంది. మహేంద్రసార్ తో పనుండి వచ్చాను మేడమ్ అంటుంది. ఫోన్లో మాట్లాడొచ్చుకదా, లేదా కాలేజ్ లో మాట్లాడొచ్చుకదా..తనకు అసలే ఒంట్లోబాలేదు అంటుంది. ధరణి రాత్రి కషాయం తాగాక చిన్నమావయ్యాగారికి తగ్గింది అంటుంది. మహేంద్ర కషాయం చేసింది ఎవరు అనుకున్నారు మన రిషీయే అంటాడు. దేవయాని మళ్లీ తనకు ఒంట్లోబాలేదు నువ్వు వెళ్లు అంటే..మహేంద్ర తనతో పనుండి నేనే రమ్మన్నాను అంటాడు. ఫణీంద్ర ఏం పని అంటే..ఏదో ప్రోగ్రామ్ చాట్ లో బడ్డెట్ గురించి అంటాడు మహేంద్ర. రిషీ మనసులో వీళ్లు ఏదో ప్లాన్ వేస్తున్నారు. నిజంగా బడ్జెట్ గురించే అయితే నన్ను పిలుస్తారుగా అనుకుంటాడు. మహేంద్ర వసూని తీసుకుని పైకి వెళ్తాడు.

వసూ రిషీసార్ మీకు కషాయం చేసి ఇచ్చారా అంటే..మహేంద్ర ఎందుకు గుర్తుచేస్తావ్ అమ్మా దాని గురించి అంటాడు..రిషీ సార్ మీకోసం ప్రేమతో కషాయం చేసిస్తే అలా అంటారేంటి..మీరు సెల్ ఫోన్ స్విచ్ఛ్ ఆఫ్ చేశారని జగతిమేడమ్ కంగారు పడ్డారు అందుకే నేను వచ్చాను సార్ అంటుంది వసూ. మహేంద్ర మనసులో నువ్వు రావాలనే కదమ్మా నేను ఈ జ్వరం డ్రామా ఆడింది..నా అంచనా ప్రకారం రిషీ రావాలే అనుకుంటాడు..ఇంతలో రిషీ ఫోన్ మాట్లాడినట్లు యాక్ట్ చేస్తూ నెమ్మదిగా వస్తాడు. అది చూసిన మహేంద్ర..కావాలనే వసుధార ఈ శిరీష్ సంగతేంటి అంటాడు. వసూ శిరీష్ చాలా టెన్షన్ లో ఉన్నాడు సార్ అంటుంది. మహేంద్ర నేను ఉన్నాను కదా వసుధార, అక్కడ జగతి ఎలాగో ఉంది అంటాడు. ఇప్పుడు నీకు ఇస్తాను చూడ్రా అనుకుని వసుధార నేనొక లిస్ట్ చెప్తాను గుర్తుపెట్టుకో..ఎంగేజ్ మెంట్ అవసరాలు,పూలు, రింగ్స్ ఉంటాయ్ కదా..ఈ విషయం చాలా రహస్యంగా ఉంచాలి..ఎంగేజ్ మెంట్ గురించి ఎ‌వరికి చెప్పొద్దు అంటాడు. రిషీ మీరు చెప్పకపోతే నేను తెలుసుకోలేనా అనుకుని వెళ్లిపోతాడు.

మరోసీన్ లో దేవయాని కషాయం రిషీ ఎలా చేశాడు అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో ధరణి వస్తుంది. నీకు కషాయం చేయటం వచ్చా అంటే..ధరణి కొంచెం తెలుసు, కొంచెం తెలియదు అంటుంది. నేను నీకు వచ్చారాదా అని అడిగాను అంతే అంటుంది దేవయాని ధరణి తెలియదు అంటుంది. మరి రిషీకి ఎవరు చెప్పారో అడిగావా అంటే..అడగలేదు అంటుంది ధరణి. నువ్వు ఇలాంటివి అడగవు, కాఫీ తాగుతారా, భోజనం చేస్తారా అని మాత్రమే అడుగుతావ్. వసుధార ఎందుకు వచ్చిందో తెలుసా అంటుంది. ఏదో కాలేజ్ పనుంది అన్నారు కదా అంటే..దేవయానికి మండిపోతుంది. మొత్తం కోపం అంతా ధరణిమీద తీర్చుకుంటుంది.

ఇంకోవైపు రిషీ ఎంగేజ్ మెంట్ గురించి ఎవరికి చెప్పొద్దు అన్న మహేంద్ర మాటలను తలుచుకుని శిరీష్ కి కాల్ చేస్తాడు. మీ ఎంగేజ్ మెంట్ అంటకదా అంటే..మీకు ఎలా తెలిసింది సార్ అంటాడు శిరీష్. తెలిసింది అంటాడు రిషీ. శిరీష్ వసుధార చెప్పిందా..మా వసుధార అంతే సార్, చిన్నప్పటి నుంచి ఏది మనసులో దాచుకోదు, మహేంద్రసార్ మాకు చాలా సపోర్టు చేస్తున్నారు. మహేంద్రసార్ చెప్పారా మా వసూ చెప్పిందా మా వసూనే చెప్పి ఉంటుంది, పెద్దలు లేకుండా చేసుకోవాల్సి వస్తుంది సార్ మీరు కూడా సపోర్ట్ చేయాలి అంటాడు. రిషీ బాయ్ చెప్పి కాల్ కట్ చేస్తాడు. వసూ ఒకప్పుడు టీచర్ అవుతాను అన్న సీన్ గుర్తుచేసుకుని పంతులమ్మ అవుతా అనింది..ఇప్పుడు చదువునేంచేస్తుంది..అటకెక్కిస్తుందా, పక్కనపెడుతుందా అనుకుంటూ రిషీ తనలో తనే ఫీల్ అవుతాడు.

ఇంకోసీన్ లో వసూ, పుష్పా మాట్లాడుకుంటూ వస్తారు. రిషీ సార్ ని రెండుమూడురోజులు లీవ్ అడగాలి ఇది నా లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ వర్క్ అంటుంది. ఇంతలో రిషీ కారు స్పీడ్ గా తీసుకొస్తాడు. వసూ వచ్చి గుడ్ మార్నింగ్ సార్ అంటే..చూసుకోని నడవాలని తెలియదా ఏంటి ఏం మాట్లాడవ్ అని వెళ్లిపోతాడు. పుష్పా ఏంటి వసూ రిషీ సార్ కి ఎందుకు కోపం వచ్చింది, మనం పక్కనే నడుస్తున్నాం కదా అంటుంది. నువ్వు అంత ఆలోచించకు, సార్ కి కోపం వచ్చింది తిట్టారు అంతే అంటుంది వసూ. సార్ ని బానే వెనకేసుకొస్తున్నావ్ ఎంతైనా సార్ అసిస్టెంట్ వి కదా అంటుంది పుష్పా. అదేం పెద్ద సింహాసనం కాదమ్మా, కావాలంటే చెప్పు నీకు ఇప్పిస్తా అని ముందుకు నడవబోతాడు. రిషీ అక్కడే ఉంటాడు. వసూ మా మాటలు విన్నారా ఏంటి అనుకుంటుంది. రిషీ దగ్గరకు వచ్చి ఏం మాట్లాడుకుంటున్నారు, కాలేజ్ సబ్జెట్ గురించి మాట్లాడోకోండి, ఇంటి నుంచి రావటం, కబుర్లు చెప్పుకోవటం, క్యాంటిన్ లో తినటం, మధ్యలో లవ్ లు, పెళ్లిల్లు, కాలేజ్ గొప్పతనం పెంచేందుకు ఛానల్ వాళ్లు వస్తే ఆ ఇంటర్వూకి ఉండరు, అడిగితే ఏవోవో సమాధానాలు వస్తాయ్ అంటాడు. ఇంతలో జగతి కూడా వస్తుంది. రండి మేడమ్ కరెక్ట్ టైం కి వచ్చారు..మీ స్టూడెంట్స్ కి మిషన్ ఎడ్యుకేషన్ గురించే కాకుండా నాలుగు పనికొచ్చేమాటలు చెప్పొచ్చుగా అంటాడు. జగతి ఏ విషయంలో సార్ అంటుంది. అన్నీ విషయాల్లోను మేడమ్, కాలేజ్ కి వస్తారు, వెళ్తారు, అంతలోనే ప్రేమలు, పెళ్లిలు, పెద్దలను ఎదిరించడాలు, ఏంటి మేడమ్ ఇది లైఫ్ లో ప్లానింగ్ అంటూ ఉండాలి కదా అంటాడు. జగతి ఏంటి రిషీ అర్థంలేకుండా మాట్లాడుతున్నాడు అనుకుంటుంది. రిషీ ఎక్కడినుంచో వస్తారో, అడ్మిషన్ తీసుకుంటారు, ఏదేదో చేస్తారు, తర్వాత ప్రేమలు, పెళ్లిల్లు ఏంటి మేడమ్ ఇది..చెప్పండి వీళ్లకి ఒక క్రమశిక్షణ పద్ధతి ఉండాలికదా, లెఫ్ అనేది ఒక తెల్లకాగితం లాంటిది, మనం ఏం రాసుకుంటే అదే ఉంటుంది అంటూ క్లాస్ ఇస్తాడు. ఇంతలో ఎపిసోడ్ ముగుస్తుంది.

తరువాయిభాగంలో రిషీ వసుధారతో శిరీష్ నన్ను ఎంగేజ్ మెంట్ కి పిలిచాడు అంటాడు. మీ ఇద్దరు ఫ్రెండ్స్ కదా మళ్లీ ప్రేమ ఎలా అంటే..ఫ్రెండ్స్ అయినా కాకపోయినా ప్రేమపుట్టడానికి ఎంతసేపు సార్ అంటుంది వసూ. ఈ విషయం నాకైనా చెప్పాలనిపించలేదా వసుధార అంటాడు రిషీ. ఇందులో ఏముంది సార్ చెప్పడానికి అయినా శిరీష్ చెప్పొద్దు అన్నాడు అర్థంచేసుకోండి సార్ అంటుంది. పాపం రిషీ గుప్పెడంతమనసులో మోయలేనిభారాన్ని మోస్తూ..నన్ను ఇంత లైట్ తీసుకున్నావా వసుధార అనుకుంటాడు. చూద్దాం రేపైనా ఈ సస్ పెన్స్ కు తెరపడుతుందో లేదో.

– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version