గుప్పెడంతమనసు ఎపిసోడ్ 248: వసూ చేయ్ పట్టుకుని సారీ చెప్పిన రిషీ

-

గుప్పెడంతమనసు ఈరోజు ఎపిసోడ్ లో మహేంద్ర, జగతి ఇంటికొస్తారు. జగతి రిషీ అన్న మాటలను తలుచుని బాధపడుతుంది. మహేంద్ర చేయ్ పట్టుకోబోతే..జగతి పర్లేదు..నేను ఒంటరిగానే నడుస్తాను అంటుంది. నన్ను పట్టుకోని అంటాడు. 20ఏళ్లగా ఒంటరిగా నడుస్తున్నాను..నాతో నడవటానికి నీకు మనసుండొచ్చు కానీ..అవకాశం కూడా ఉండాలిగా మహేంద్ర అంటూ..బేలగా మాట్లాడుతుంది. కొత్త ఆలోచనలు కొత్త ఆసలు కలిగించొద్దని నీకు ముందునుచ్చే చెప్తాను, వినటం లేదు..నేను చెప్పిన మాటే నా కొడుకు ఇంకో రకంగా చెప్పాడు అని కుటుంబం ఉన్న ఏం లేనట్టే అంటు కొడుకు పైన ఉన్న ప్రేమ చెప్పుకుని బాధపడుతుంది. నువ్వు ఉన్నావ్ అలా వర్షంలా వచ్చి వెళ్తావ్ ..వర్షంలా వచ్చి వెళ్తేనే బాగుంటుందేమో అని ఏడ్చుకుంటూ ఇంట్లోకి వెళ్తుంది. మహేంద్ర కూడా గడపదాటబోతే..జగతి చేయి అడ్డం పెట్టి వెళ్లిపో మహేంద్ర అంటుంది. కసేపు కుర్చుని వెళ్తాను అని మహేంద్ర అంటాడు. నువ్వు లోపలకి వచ్చి ఏం మాట్లాడతావో నాకు తెలుసు, నన్ను ఓదారుస్తావ్, నాకు ఇప్పుడు ఎవ్వరి ఓదార్పు అవసరం లేదు, నన్ను ఇలా ఒంటరిగా వదిలేయ్ అంటుంది. మహేంద్ర నచ్చచెప్పబోతే.. జగతి దణ్ణం పెట్టి దయచేసి ఇక్కడికి రాకు.. రిషీ కోరుకున్నది కూడా ఇదే అని వెళ్లిపోతుంది.

ఇంకోవైపు వసుధార రిషీ ప్రవర్తనను తలుచుని దీనంగా నడుచుకుంటూ వెళ్తుంది. ఫ్రెండ్స్ పలకరించినా పట్టించుకోదు. సార్ కి అంత కోపం ఎందుకు వచ్చింది, నేను చేసిన తప్పేంటి, ఏ కారణం లేకుండా అలా చేయటం ఏంటి అని ఆలోచించుకుంటూ వెళ్తుంది. రవీంద్ర పిలుస్తాడు కానీ వసూకి వినపడదు. వెళ్తుంది. తన ఫ్రెండ్ పిలిచినా వసూ పట్టనట్లుగానే ఉంటుంది. వసూని ఏంటి అలా ఉన్నావ్, క్లాస్ కి రావా అని అడుగుతుంది. లేదు ఇంటికి వెళ్తున్నాను అని చెప్పి వెళ్తుంది.

రిషీ..మహేంద్ర అన్న మాటలను తలుచుకుంటూ ఉంటాడు. రవీంద్ర రిషీ క్యాబిన్ కి వస్తాడు. డోర్ దగ్గర పడిపోయిన ఫైల్ తీసుకుని రీషీ ఏంటిది..ఫైల్ నేలమీద ఉన్నా కూడా చూసుకోవటం లేదా అని అడుగుతాడు. టేబుల్ మీద కూడా చిందరవందరగా ఉన్న ఫైల్ చూసి రవీంద్ర ఏంటిది రిషీ..నీ టేబుల్ ఎప్పుడూ నీట్ గా పద్ధతిగా ఉండేదిగా ఏంటిది అని అడుగుతాడు. కొన్ని పద్ధతులు మారిపోతే వాటిని సరిచేస్తున్నాను పెద్దనాన్న అంటాడు. రవీంద్ర వసుధార కనిపించిన విషయం చెప్తాడు, పిలిచినా పలకలేదు..ఈ లోకంలో ఉన్నట్లే కనిపించలేదు అంటాడు. ఇంతలో వసూ వెళ్లేది రిషీ కిటికీలోంచి చూస్తాడు. రిషీ..వసుధారతో ఏమైనా పనుందా పిలిపించిమంటారా అంటాడు. వద్దులే ఎడ్యుకల్చర్ లో డౌట్ ఉండి పిలిచాను అంటాడు. అలా మాట్లాడుకుంటూ ఉండగానే..రవీంద్ర రిషీ మూడ్ కూడా బాలేనట్లుంది అనుకుని వెళ్పిపోతాడు. రిషీ..ఈ వసుధారకు ఏమైంది అరిస్తే వెళ్లిపోవడమేనా అనుకుంటాడు.

ఆటోలో వెళ్తున్న వసుధార రిషీ ఎందుకు కోపడ్డాడో తెలియక మదన పడుతూ ఉంటుంది. ఉదయం దేవయానితో జరిగిన విషయం చెప్పి ఉంటుందా అందుకే అరిచారా అనుకుంటూ ఉంటుంది. రిషీ కార్ అడ్డుగా పెట్టటంతో ఆటో ఆపుతాడు. రిషీ వచ్చి పదా అంటాడు. వసుధార కోపంగా నేనెక్కిడికి రాను సార్ అని ముఖం తిప్పుకుంటుంది. పనుంది వెళ్దాం పదా అంటాడు రిషీ.. మీతో నాకేం పనిలేదు, నాక్కూడా పనుంది వెళ్లాలి అంటూ..డ్రైవర్ ను వెళ్దాం పదా అంటుంది. వసుధార ఎందుకు మొండికేస్తున్నావ్ అని కోపంగా అడుగుతాడు. వసుధార నేను చెప్పానుకదా సార్ రానని అంటుంది. సరే నువ్వు రాకపోతే నేనే నీతో వస్తాను, నీ పనయ్యేదాక ఉంటాను అని ఆటో ఎక్కుతాడు. వసూ ఆటో దిగి డ్రైవర్ కి డబ్బులు ఇచ్చి సర్ దిగండి అంటుంది. రిషీ ఇందాక అడిగితే రానన్నావ్ కదా అంటాడు. సర్ ప్లీజ్ సర్ దిగండి అంటుంది. రిషీ దిగుతాడు. ఇద్దరు కారు ఎక్కి ఒక చోటుకి వెళ్తారు. ఏం మాట్లాడుకుండా నిల్చుంటారు. ఒకళ్లకొకరు మాట్లాడాలా వద్దా అనుకుంటూ ఉంటారు. ఫైనల్ గా రిషీ..సరే బ్రేక్ ద సైలెన్స్ అని సడన్ గా కాలేజ్ లోంచి వచ్చేస్తే నేనేమనుకోవాలి అంటాడు. ఫైల్ తీసి మొఖాన విసిరేస్తే నేను ఏం అనుకున్నానో మీరు అదే అనుకోండి అంటుంది.

నువ్వు వ్రాంగ్ టైంలో వచ్చావు వసుధార అంటాడు.. టైం ఎప్పుడు ఒకేలా ఉంటుంది అని వసుధార ఇలా ఒకరినొకరు డైలాగ్స్ వేసుకుంటారు. రిషీ ఇప్పుడు సారీ చెప్పాలా ఏంటి నో నేను చెప్పను అనుకుంటాడు. వసుధారకు దేవాయని అన్న మాటలు గుర్తుకొచ్చి..మీరు ఎందుకు డిస్టబ్ అయ్యారో తెలుసుకోవచ్చా అని అడుగుతుంది. రిషీ అవన్నీ ప్రస్తుతం మనం మాట్లాడుకోకపోతేనే బాగుంటుంది అంటాడు. వసూ దేవయాని మేడమ్ చాడీలు చెప్పి ఉంటుంది అనుకుంటుంది. రిషీ..నా మనసులోంచి కొత భారం తగ్గింది అంటాడు. వసూ తగ్గాల్సింది మీకు కాదు నాకు అనుకుటుంది. రిషీ వసూ చేయ్ పట్టుకుని సారీ వసుధార అంటాడు. వసూ పర్లేదు సార్ పర్లేదు అంటుంది. కట్ చేస్తే అది వసూ భ్రమ..హలో వసుధార ఏంటి, ఏం పర్లేదు అంటున్నావ్ అని రిషీ అడుగుతాడు. వసూ చేయ్ వెనక్కుతీసుకని రిషీ సార్ సారీ చెప్పలేదా, ఇదంతా నా ఊహా, నేను రిషీ సార్ నుంచి సారీ కోరుకుంటున్నానా అనుకుంటుంది. రిషీ ఏదో పని ఉంది అన్నావుగా రా డ్రాప్ చేస్తాను అంటాడు. డ్రాప్ చేయటం కాదు, మీరు రావాలి అంటుంది వసూ. ఎక్కడికి అని రిషీ అడుగుతాడు. రండి సార్ మీకే తెలుస్తుంది అని ఇద్దరు కారు ఎక్కుతారు.

ఇంట్లో దేవాయని హాలో కుర్చుని ఫోన్ చూస్తూ ఉంటుంది. రవీంద్ర వస్తాడు. అదేంటండి..మీరు ఒక్కరే వచ్చారు, మహేంద్ర, రిషీ రాలేదేంటి అని అడుగుతుంది. వస్తారులే దేవాయని ఏదో పని ఉండి ఆగారు, రిషీ ఏదో చిరాకుగా ఉన్నాడని చెప్తాడు. అవునా రిషీకి చిరాకు వచ్చిదంటే ఏదో పెద్ద విషయమే అయి ఉంటుంది అని దేవాయని అంటుంది. అలా ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాయిభాగంలో వసూ రిషీకి రెస్టారెంట్ లో కాఫీ, ఐస్ క్రీమ్ ఇస్తుంది. కాఫీని రిషీ కోపంగా, ఐస్ క్రీన్ ని రిషీ మంచితనంగా చెప్పి..ఇవి రెండూ ఒకే దగ్గర ఉంటే బాగుండవు అంటుంది. కానీ మన ఇగో మాష్టార్ కాఫీ తాగీ ఐస్ క్రీమ్ లాగిస్తాడు. వసూ అది చూసి.ఇదేంటి ఇలా తినేస్తున్నారు అనుకుంటుంది. మరన్ని వివరాలు రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version