కేశ సంరక్షణ: షాంపూ స్నానం చేసేటపుడు తెలుసుకోవాల్సిన విషయాలు..

-

వారానికి ఒకటి లేదా రెండు సార్లు, కొంతమంది ఇంకా ఎక్కువసార్లు షాంపూ స్నానం చేస్తుంటారు. కేశ సంరక్షణలో షాంపూ స్నానం ముఖ్యమైనది. ఐతే షాంపూ స్నానంలో చాలా పొరపాట్లు చేస్తుంటారు. దీనివల్ల జుట్టుకి చేటు కలుగుతుంది. షాంపూ స్నానం చేసేటపుడు ఎలాంటి పొరపాట్లు చేయవద్దో ఇప్పుడు తెలుసుకుందాం.

షాంపూ తో కేవలం తల శుభ్రం అవుతుంది

నెత్తి శుభ్రం చేసుకోవడానికే షాంపూ పనిచేస్తుంది. 30సెకన్ల పాటు షాంపూతో మసాజ్ చేసుకోవడం ఉత్తమం. మీ జుట్టును బట్టి ఇంకా కొంచెం సేపు సమయాన్ని పెంచుకోవచ్చు. అదీగాక షాంపూతో శుభ్రం చేసుకోవాలంటే ముందుగా జుట్టును, నెత్తిని బాగా తడపాలి.

చాలా కొద్ది పరిమాణం మాత్రమే షాంపూ వాడాలి. అది కూడా నీటిలో కలిపిన తర్వాతే

షాంపూని డైరెక్టుగా జుట్టుకి మర్దన చేయవద్దు. నీళ్ళలో కలిపిన తర్వాత మాత్రమే జుట్టుకి మర్దన చేయాలి. లేదంటే జుట్టు పాడవుతుంది. జుట్టు తెల్లబడడానికి కూడా ఇదొక కారణం

ఎన్ని రోజులకి ఒకసారి షాంపూ చేయాలనేది వారి వారి జుట్టు మీద ఆధారపడి ఉంటుంది.

ముందుగానే చెప్పినట్టు అందరూ వారానికి ఒకసారి షాంపూ చేస్తున్నారని మీరు కూడా అదే ఫాలో అవడం కరెక్ట్ కాదు. మీ జుట్టుకు ఎలా సరిపడుతుందో తెలుసుకోండి. కొందరికి వారానికి ఒక్కసారి షాంపూ చేసినా సరిపోతుంది. మరికొందరు రోజూ చేయాల్సి రావచ్చు. దీనికోసం నిపుణుల సలహా తీసుకోండి.

ఇక్కడ బెస్ట్ షాంపూ అనేదే లేదు.

మార్కెట్లో దొరికే ఎన్నో షాంపూల్లో బెస్ట్ షాంపూని వాడుతున్నానని మీరంటే మీకేమీ తెలియదని అనుకోవాలి. ఎందుకంటే బెస్ట్ షాంపూ అనేదే లేదు. ఒక్కో షాంపూ ఒక్కొక్కరికీ ఒక్కోలా ఉంటుంది. కాబట్టి మీ జుట్టుకు ఏది సరిపడుతుందో తెలుసుకోండి.

టవల్ తో తడిసిన జుట్టును ముడి వేయవద్దు

జుట్టును ఆరబెట్టడానికి టవల్ తో ముడివేస్తారు. దానివల్ల జుట్టు విరిగిపోయే అవకాశం ఎక్కువ. అందుకే కాటన్ టవల్ లేదా టీ షర్ట్ వాడి జుట్టును తుడుచుకోండి.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version