గుప్పెడంతమనసు ఈరోజు ఎపిసోడ్ లో రిషీ ఇంట్లో ఒక్కడే కుర్చుని ఉదయం వసూ అన్నమాటలను తలుచుకుంటూ ఉంటాడు. అటుగా వెళ్తున్న ధరణి చూసి రిషీ దగ్గరకు వెళ్తుంది. ఏంటి ఇక్కడ కుర్చున్నావ్, భోజనం కూడా చేయలేదు అంటుంది. రిషీ ఆకలిగా లేదు వదినా అంటాడు. ఏదో బాధగా ఉన్నట్లు కనిపిస్తున్నావ్ అంటుంది ధరణి. వదినా నమ్మకం అనే పదం మీద నాకు నమ్మకం పోతుంది వదినా..అంటే మనుషులమీద నమ్మకం పోతుంది, మన లైఫ్ జర్నీలో కొందరిని నమ్ముతాం..వాళ్లు రైలు ప్రయాణంలా వాళ్ల స్టేషన్ రాగానే వెళ్లిపోతుంటారు. ఒకప్పుడు సాక్షి వచ్చింది చదువులంది, ఏదేదో చెప్పింది లండన్ వెళ్లిపోయింది. ఇప్పుడు వసుధార అనబోతాడు.ఆగిపోతాడు. ధరణి ఇప్పుడు ఎవరు వెళ్తున్నారు అంటుంది. ఎవరు వెళ్లినా నాకేంటంట అంటాడు. అలా రిషీ వసూ గురించి బాధపడుతూ ఆ విషయం బయటకు చెప్పకుండా జీవతం యొక్క అర్థాన్ని ధరణీకి చెప్తాడు. ఫైనల్ గా ఇవన్నీ ఆలోచించి టైం వేస్ట్ వదినా. ఎవరికోసమో నేనెందుకు బాధపడటం అంటాడు.
ఇంట్లో రిషీ రెడీ అయి వసూ తన జీవితంలో ఇచ్చిన కొన్ని వేల జ్ఞాపకాలను తలుచుకుని..ఏంటి వసుధార ఇది తెల్లకాగితలాంటి నా జీవితంలోకి వచ్చి జ్ఞాపకాల పూలు అందించాం. శిరీష్ తో నీ ఎంగేజ్ మెంట్ అని నాతో ఒక్కమాట కూడా చెప్పలేదుకదా, భయం అడ్డొచ్చిందా, కోపం అడ్డొచ్చిందా, నీకు నా మీద ఉన్న భయం ఇంత పనిచేస్తుందని నేను అనుకోలేదు అంటూ రిషీ బాధపడతాడు. ఇంకోవైపు మహేంద్ర ఉషారుగా రెడీ అవుతూఉంటాడు. ఇంతలో ధరణి వచ్చి రిషీ గురించి ఆలోచిస్తుంటే భయమేస్తుంది అని రాత్రి జరిగిన సీన్ గురించి చెప్తుంది. బయటపడితే రిషీ ఎందుకు అవతుతాడమ్మా, తన మనసు తన తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాడు, నేను అందుకోసమే ఎదురుచూస్తున్నాను అంటాడు. సమస్య, పరిష్కారం రెండూ తనే అంటాడు.
ఇటువైపు రిషీ బట్టలు సర్తుకుంటూ వసూ గురంచే ఆలోచిస్తాడు. తనతో ఉన్న చిన్న చిన్న రొమాంటిక్ సీన్స్ తలుచుకుంటూ ఉంటాడు. తనకు మేకప్ వేసింది. ఇద్దరు కలిసి డ్యాన్స్ వేసింది, కొబ్బరిబోండాల షాపులో కొబ్బరినీళ్లు తాగింది, వసూ చెప్పే కొటేషన్స్ ఇలా అన్నీ తలుచుకుంటూ ఉంటాడు. ఇంతలో మహేంద్ర వస్తాడు. రిషీ ఏం చేస్తున్నావ్ అంటాడు. బట్టలు సర్దుకుంటున్నాను అంటాడు. మహేంద్ర ఎటువెళ్తున్నావ్ అంటే..ఏటో ఒక చోటకి అంటాడు రిషీ. జరిగే ఎంగేజ్ మెంట్ నచ్చక వెళ్తున్నావా అంటాడు మహేంద్ర. రోజుకి ఎన్నో ఎంగేజమ్ మెంట్స్ జరుగుతాయి దాంతో నాకేంటి సంబంధం అంటాడు. ఇలా మహేంద్ర ఒకటి చెప్తే రిషీ ఒకటి అర్థంచేసుకుంటాడు. ఫైనల్ గా బ్యాగ్ తీసుకుని రిషీ వెళ్లిపోతాడు.
మరోపక్క జగతి ఇంట్లో ఏర్పాట్లు అన్నీ పూర్తిఅవుతాయి. మహేంద్ర శిరీష్ ని రెడీచేస్తాడు. వసూ అమూల్యను రెడీ చేస్తుంది. నన్ను రెడీ చేశావ్..మరి నువ్వు రెడి అవ్వవా అంటుంది. ఇంతలో జగతి కూడా వచ్చి ఏంటి వసూ ఇంకా ఇలానే ఉన్నావ్ వెళ్లి చీరకట్టుకో వెళ్లు అంటుంది. అప్పుడే రిషీ ఎంటర్ అవుతాడు. ఎపిసోడ్ అయిపోతుంది. రేపు రిషీ ఏం రచ్చ చేయబోతున్నాడో.