డియ‌ర్ కేటీఆర్ సార్..ఇదెక్క‌డి న్యాయం..అన‌సూయ సూటి ప్ర‌శ్న‌..!

-

క‌రోనా లాక్ డౌన్ త‌ర‌వాత స్కూళ్లు తెరుచుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే పిల్ల‌ల‌కు మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కూ వ్యాక్సిన్ ఇవ్వ‌డం మొద‌లు పెట్ట‌లేదు. దాంతో త‌ల్లిదండ్ర‌లు ఆందోళ‌న చెందుతున్నారు. అయితే ఈ విష‌య‌మై అన‌సూన కేటీఆర్ ను సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌శ్నించింది. డియర్ కేటీఆర్ సార్.. అసలు లాక్‌డౌన్‌ ఎందుకు వచ్చిందని… అన్‌లాక్‌ ఎందుకు చేశారు అనేది అర్థం చేసుకోవాలి. మనందరికీ వ్యాక్సిన్‌ వేస్తున్నామని కాస్త భరోసా ఇచ్చారని పేర్కొంది. మరి టీకా వేయాల్సిన వయస్సు కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల సంగతేంటి సార్? అంటూ అన‌సూయ కేటీఆర్ ను ప్ర‌శ్నించింది.

anasuya requests ktranasuya

వాళ్ళను స్కూల్స్ కు పంపించాల‌ని యాజమాన్యాలు తల్లిదండ్రులను ఎందుకు బలవంతం చేస్తున్నాయి.? అంటూ నిల‌దీసింది. అంతే కాకుండా పిల్లలు స్కూల్‌లో ఉన్నప్పుడు వారికి ఏమైనా జరిగితే తమ బాధ్యత కాద‌ని పేర్కొంటూ పేపర్‌పై యాజ‌మాన్యాలు సంతకం కూడా చేయించుకుంటున్నాయని అన‌సూయ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. చెప్పండి.. ఇదెక్కడి న్యాయం.. ఇది ఎంతవరకు సమంజసం. ఎప్పటిలాగే మీరు సరైన మార్గనిర్దేశం చేస్తారని ఆశిస్తున్నా…అంటూ అన‌సూయ కేటీఆర్ ను సూటిగా ప్ర‌శ్నించింది. మ‌రి అన‌సూయ ప్ర‌శ్న‌ల‌కు కేటీఆర్ ఎలా స‌మాధానం ఇస్తారా చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version