రాష్ట్రంలో గురుకుల విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. సమస్యలు, చదువుల ఒత్తిడి కారణంగానే విద్యార్థులు బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. తాజాగా మహబూబ్ నగర్ జిల్లా బాలనగర్ మండల కేంద్రంలోని బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో గురువారం ఉదయం టెన్త్ క్లాస్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.
వివరాల్లోకివెళితే.. కల్వకుర్తికి చెందిన ఆరాధ్య (16) బాలికల గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతోంది.ఉదయం 6:30 గంటల సమయంలో తరగతి గదిలోకి వెళ్లి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.గమనించిన తోటి విద్యార్థులు టీచర్లకు సమాచారం ఇచ్చారు. వెంటనే స్కూల్కు వచ్చిన టీచర్లు హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందిందని నిర్ధారించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.